AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడేళ్ల క్రితం కొన్న ఇంటిని శుభ్రం చేస్తుండగా.. రహస్య గది తలుపు తెరుచుకుంది..! అందరూ షాక్‌..

రియల్ ఎస్టేట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కదిలించిన ఒక హార్రర్‌ సినిమా లాంటి సంఘటన ఒకటి చైనాలో వెలుగు చూసింది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఒక నగరంలో నివసిస్తున్న లి అనే యువకుడు తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఊహించని దృశ్యం కనిపించింది. అది అతని జీవితాన్ని తలక్రిందులు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టించింది.

ఏడేళ్ల క్రితం కొన్న ఇంటిని శుభ్రం చేస్తుండగా.. రహస్య గది తలుపు తెరుచుకుంది..! అందరూ షాక్‌..
Hidden Room
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2025 | 4:35 PM

Share

రియల్ ఎస్టేట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కదిలించిన ఒక హార్రర్‌ సినిమా లాంటి సంఘటన ఒకటి చైనాలో వెలుగు చూసింది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఒక నగరంలో నివసిస్తున్న లి అనే యువకుడు తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఊహించని దృశ్యం కనిపించింది. అది అతని జీవితాన్ని తలక్రిందులు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టించింది. లి 2018లో దాదాపు 2 మిలియన్ యువాన్లకు (సుమారు రూ. 2.24 కోట్లు) ఆ ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే, ఏడు సంవత్సరాల తరువాత, 2025లో అతడు ఆ ఇంటిని శుభ్రం చేస్తుండగా, మెట్ల వెనుక ఒక సీక్రెట్‌ డోర్‌ కనిపించింది. అది చూసిన లి ఆశ్చర్యపోయాడు. తలుపు తెరిచి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అతను ఒక్కసారిగా కంగుతిన్నాడు..అది పూర్తిగా పొదలతో కప్పబడిన విశాలమైన నేలమాళిగ. రాత్రిపూట వినిపించే వింత శబ్దాలకు ఇదే కారణం అని అతడు గుర్తించాడు.

తాము బేస్మెంట్ కొనుగోలు చేసినప్పుడు దాని గురించి తమకు సమాచారం ఇవ్వలేదని లీ వివరించాడు. ఆ ఇల్లు నగర కేంద్రంలో ఉంది. ప్రజా రవాణా సౌకర్యాలు బాగా ఉన్నాయి. మంచి మరమ్మత్తులో ఉన్నాయి. కానీ, రాత్రులు వింతగా మారుతుండేది. ఇంటి వెనుక నుండి టెలివిజన్ శబ్దాలు, సన్నని నవ్వుల శబ్ధం. కొన్నిసార్లు గాజు శబ్దాలు వినిపించేవని చెప్పాడు..కానీ, లీ అది ఎలుకల శబ్దం లేదంటే గాలి శబ్దం కావచ్చు అని అనుకున్నాడు. కానీ, ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు అతను మెట్ల వెనుక ఉన్న పాతకాలపు తలుపును చూసి ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. కనుగొన్నాడు. తలుపు తెరిచి చూడగా, చల్లని గాలి వీచింది. లోపల దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఒక మహిళ నివసిస్తోంది.

ఆమె దొంగ, అపరిచితురాలు, దెయ్యం కాదు.. ఈ ఇంటి మాజీ యజమాని. జాంగ్ అనే పేరుగల ఇంటిఓనర్‌ . జాంగ్ ఈ ఇంటిని అమ్మేసింది. కానీ, బేస్‌మెంట్‌ను ఎప్పుడూ బదిలీ చేయలేదు. దానిని తన ప్రైవేట్ రెస్ట్‌హౌజ్‌గా మార్చుకుంది. ఆమె ఏడు సంవత్సరాలుగా అక్కడే రహస్యంగా నివసిస్తోంది. ఈ విషయం ఆ ఇంటి కొత్త యజమానికి తెలియకుండానే. లి ఒక వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది నిమిషాల్లోనే వైరల్ అయింది. వీడియోలో, లి వణుకుతున్న స్వరం స్పష్టంగా వినబడుతుంది.. నేను మేడమీద నిద్రపోతున్నాను, కింద ఎవరో నాకు చెప్పకుండా నా ఇంటిని ఉపయోగిస్తున్నారు. ఇది భయానకంగా ఉంది! నెటిజన్లు దీనిని 2019 దక్షిణ కొరియా చిత్రం పారసైట్‌తో పోల్చారు. ఇక్కడ ఒక కుటుంబం రహస్యంగా ఒక సంపన్న ఇంట్లో నివసిస్తుంది.

ఇవి కూడా చదవండి

షాక్ కు గురైన యజమాని:

జాంగ్, బేస్మెంట్ అమ్మకపు ఒప్పందంలో చెప్పలేదని పేర్కొంది. ఆమె లితో ఇలా చెప్పింది..నేను ఇంటిని అమ్మేశాను, కానీ నేను ఎప్పుడూ బేస్మెంట్ గురించి ధరలో భాగంగా ప్రస్తావించలేదు. ఇది నా వ్యక్తిగత స్థలం, నేను నా ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకునే ప్రదేశం. కానీ, లి మొత్తం ఆస్తి తనదేనని, పూర్తి ధర చెల్లించానని చెప్పాడు. అతను వెంటనే జాంగ్‌ను ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్‌ చేశాడు.. కానీ, జాంగ్ నిరాకరించింది. చివరకు లి స్థానిక కోర్టులో కేసు దాఖలు చేశాడు. కోర్టు లీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది – బేస్మెంట్ ఆస్తిలో భాగం, జాంగ్ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తీర్పు వెల్లడించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..