AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హ్యాట్సాఫ్ బ్రో..! ఆన్‌లైన్‌లో స్వీట్స్‌ ఆర్డర్‌ పెట్టాడు.. డెలివరీ బాయ్‌ ఇంటి రాగానే..

ఆన్‌లైన్ డెలివరీ కార్మికులకు హోలీ, దీపావళి అన్నీ ఒకటే. ఇతరులు పండుగ వేడుకల్లో మునిగిపోయిన రోజుల్లో కూడా వారు తక్కువ జీతం కోసం పనిచేస్తారు. అటువంటి పరిస్థితిలో డెలివరీ బాయ్ దీపావళి రోజును ప్రకాశవంతంగా మార్చేందుకు ఒక కస్టమర్ చేసిన పని అందరి హృదయాల్ని గెలుచుకుంది. పండగ రోజున అతడు వివిధ యాప్‌ల నుండి స్వీట్లు ఆర్డర్‌ చేశాడు.. ఆర్డర్‌ తో డెలివరీ బాయ్ ఇంటికి రాగానే అతనికి ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేశాడు.. అదేంటో చూస్తే మీరు కూడా అతనికి హ్యాట్సాఫ్ అంటారు!

హ్యాట్సాఫ్ బ్రో..! ఆన్‌లైన్‌లో స్వీట్స్‌ ఆర్డర్‌ పెట్టాడు.. డెలివరీ బాయ్‌ ఇంటి రాగానే..
Guy Orders Diwali Sweets
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2025 | 5:33 PM

Share

మెట్రో నగరాల్లో నివసించే ప్రజల జీవితాల్లో ఆన్‌లైన్ ఫుడ్, కిరాణా డెలివరీ యాప్‌లు ఒక భాగంగా మారాయి. తక్కువ సమయంలో ఆహారం, కిరాణా సామాగ్రిని డెలివరీ చేసే డెలివరీ ఏజెంట్లు సైతం శ్రద్ధగా పనిచేస్తారు. కొన్ని కంపెనీలు పండుగ రోజులలో పని చేయడానికి అదనంగా చెల్లిస్తాయి. ఇది డెలివరీ బాయ్‌లను ఆ రోజుల్లో కూడా ప్రజల ఇళ్లకు వస్తువులను డెలివరీ చేయడాన్ని ప్రోత్సహిస్తుంది.

అటువంటి పరిస్థితిలో ఒక కస్టమర్ ఆన్‌లైన్ కిరాణా డెలివరీ యాప్ ద్వారా దీపావళి నాడు ఏదైనా ఆర్డర్ చేసి, ఆపై, డెలివరీ ఏజెంట్ దానిని డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు, దానిని వారికి బహుమతిగా ఇస్తే, అది ఒక ప్రత్యేకమైన క్షణం అవుతుంది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి సరిగ్గా ఇదే పని చేశాడు. నాలుగు డెలివరీ యాప్‌ల నుండి దీపావళి స్వీట్లను ఒక్కొక్కటిగా ఆర్డర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఒక కస్టమర్ బ్లింకింట్, స్విగ్గీ, జెప్టో, బిగ్ బాస్కెట్ వంటి ఆన్‌లైన్ కిరాణా డెలివరీ యాప్‌ల నుండి స్వీట్లను ఆర్డర్ చేశాడు..ఆర్డర్‌ ఇంటికి వచ్చింది. స్వీట్లు వచ్చినప్పుడు సదరు కస్టమర్‌ ఆ బాక్స్‌ను తిరిగి డెలివరీ బాయ్‌కి ఇస్తున్నాడు. స్విగ్గీ డెలివరీ బాయ్ ముందుగా వస్తాడు. అతను కస్టమర్‌కు తన ఆర్డర్‌ను అందజేసి యాప్‌లో మార్క్ చేసినప్పుడు, కస్టమర్ అతనికి స్వీట్లను అందించి, బ్రదర్ దీపావళి శుభాకాంక్షలు! అని అంటాడు. ఇది విన్న డెలివరీ బాయ్ ఒక్క క్షణం ఆగి, ఆర్డర్‌ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతను మూడు వేర్వేరు యాప్‌ల నుండి వచ్చిన ఇతర డెలివరీ బాయ్‌లతో కూడా ఇలాగే చేశాడు. సోసల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఆ వ్యక్తిని ప్రశంసలతో ముంచేశారు.

@_the_hungry_plate_ ఈ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఇలా రాశారు – ఈ దీపావళికి, మా డెలివరీలను ప్రత్యేకంగా చేసే చిరునవ్వులను మరింత అందంగా మార్చాలని మేము నిర్ణయించుకున్నాము. చాలా మంది నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ అతన్ని ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..