Watch: ఓరీ దేవుడో.. ఆఖరుకు నాచును కూడా వదట్లేదురా సామీ..! టేస్ట్ అదుర్స్ అంటూ లాగించేస్తున్నారు..
భారతదేశంలో చెరువులో తేలియాడు కనిపించే నాచు..ప్రజల్ని భయపెడుతుంది. కానీ, ఒక చిన్న గ్రామం దానిని సూపర్ ఫుడ్‌గా మార్చడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక మంచి భోజనప్రియుడు, బ్లాగర్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి చెరువు నుండి నాచును సేకరించి, మెత్తగా రుబ్బుకుని, ఆపై దాన్ని మంచి అట్టులా కాల్చుకుని తింటున్నాడు. అంతేకాదు.. దాని రుచిని కూడా అతడు ఎంతగానో ఆస్వాదిస్తున్నాడు.. వీడియో నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని వింత ఆహారాల తయారీకి సంబంధించినవి కూడా ఉంటున్నాయి. అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను షాక్ అయ్యేలా చేస్తోంది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని 48గంటల్లో 2 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇందులో ఒక వ్యక్తి నాచు నుండి రుచికరమైన దోశలాంటిది తయారు చేస్తున్నాడు. ఇతర దేశాలలో నాచును (ఆల్గే) ప్రోటీన్ బాంబుగా పరిగణిస్తారు. నాసా కూడా దీని నుండి అంతరిక్ష ఆహారాన్ని తయారు చేస్తుంది. కానీ, మన దేశంలో దీనిని చూస్తేనే చాలా మంది అసహ్యించుకుంటారు. కానీ, ఒక వ్యక్తి విప్లవం గ్రామీణ భారతదేశాన్ని ఆరోగ్య ధోరణులకు అనుసంధానిస్తోంది. వీడియో చూసిన తర్వాత, నిపుణులు దీనిని ఒక విప్లవం అని పిలుస్తుండగా, ఆల్గేలో ఉండే ఖనిజాల గురించి తెలియని వారు దీనిని చీ, చా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఒక గిన్నె తీసుకొని తన గ్రామంలోని నదిలోకి దిగాడు. నీటిపై పెద్ద మొత్తంలో నాచు తేలుతోంది. అతడు దానిని గిన్నెలోకి సేకరించాడు. తరువాత దానిని ఇంటికి తీసుకువచ్చాడు. మొదట నాచును శుభ్రంగా కడిగాడు. తరువాత రాయిపై మరింత మెత్తగా దోశ పిండిలా రుబ్బుకున్నాడు. తరువాత, కట్టెల పొయ్యిమీద ప్యాన్ వేడి చేశాడు. ఈ వేడి పాన్ మీద కాస్త ఆయిల్ వేశాడు.. దానిపై రుబ్బుకున్న నాచును పోసి ప్యాన్ కేక్‌లా తయారు చేశాడు. దానిని రెండు వైపులా బాగా కాల్చుకున్నాడు. అది పూర్తిగా కాలిన తరువాత తెలంగాణ స్పెషల్ సర్వపిండి తిన్నట్టుగా తినేస్తున్నాడు.
దాని రుచి ఎలా ఉంది?: మొదటి ముక్క తిన్న వెంటనే ఆ వ్యక్తి దానిని రుచికరంగా, ఆరోగ్యకరమైనదిగా ప్రకటించాడు. అతని కుటుంబం కూడా దానిని రుచి చూసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే వైరల్ అయింది. నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వెల్లువెత్తాయి. కొందరు దీనిని మేధావితనం అంటున్నారు. మరికొందరు చీ.. చీ అంటున్నారు. కానీ, 70 శాతం మంది వీడియోపై సానుకూలంగా స్పందించారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఆల్గేలో 60 శాతం ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, ఒమేగా-3 ఉన్నాయని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ అధ్యయనం ప్రకారం, స్పిరులినా ఆల్గే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అయితే, భారతదేశంలో కాలుష్యం ఆల్గేలో భారీ లోహాలు ఉండటానికి కారణమవుతుంది. కాబట్టి, శుభ్రమైనది తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




