మనవడితో కలిసి రోడ్డుపై దీపావళి షాపింగ్.. ఈ పెద్దాయన ఎవరో తెలుసా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి!
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దీపావళి సందర్భంగా తన మనవడితో కలిసి గాంధీనగర్ మార్కెట్‌లో షాపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సామాన్యుడిలా స్థానిక వస్తువులు కొంటూ, విక్రేతలతో సంభాషించిన ఆయన ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రధాని మోడీ 'వొకల్ ఫర్ లోకల్' సందేశాన్ని చాటిచెప్పిన సీఎం సింప్లిసిటీకి ప్రజలు ముగ్ధులయ్యారు.

దేశవ్యాప్తంగా దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ వెలుగుల పండుగ సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ఫోటో వైరల్ అవుతోంది. అదేంటంటే.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సోమవారం దీపావళి జరుపుకోవడానికి తన మనవడితో కలిసి మార్కెట్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి గాంధీనగర్ వీధుల్లో సాధారణ వ్యక్తిలా కనిపించారు. ఆయన తన మనవడితో కలిసి దీపావళికి షాపింగ్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి సామాన్యుడిలా షాపింగ్ చేయడం చూసి అక్కడున్న ప్రజలు, దుకాణదారులు ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి మార్కెట్‌లోని అనేక దుకాణాలను సందర్శించి, వస్తువులను చూసుకుంటూ, దుకాణదారులతో సంభాషించారు.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్థానిక విక్రేతల నుండి దీపాలు సహా వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని ఈ విధంగా ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి మనవడు కూడా మార్కెట్లో కొనుగోలు చేశాడు. అయితే వారు రోడ్డుపై షాపింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక ఫోటోలో ముఖ్యమంత్రి పటేల్ ఒక దీపాల దుకాణం వద్ద నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. మరొక ఫోటోలో ఆయన తన మనవడితో కలిసి రంగోలి దుకాణంలో కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఒక పిల్లవాడు ముఖ్యమంత్రితో సెల్ఫీ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది.
మార్కెట్లో, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దుకాణదారులతో సంభాషించి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి సింప్లిసిటీకి స్థానికులు ముగ్ధులయ్యారు. “సీఎం అంటే కామన్ మ్యాన్” అనే సామెతను భూపేంద్ర పటేల్ నిరూపించారు స్థానికులు చెప్పుకుంటున్నారు. అంతకుముందు ఆయన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
