AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొడుపు కథ: కాళ్లు ఉన్నా పాదాలు లేనిది ఏంటో చెప్పండి..?

పొడుపు కథలు తెలుగు సంస్కృతిలో విజ్ఞానం, వినోదాలను పంచే ఒక చక్కటి సంప్రదాయం. ఇవి జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి, ఆలోచనాశక్తిని పదును పెట్టడానికి తోడ్పడతాయి. ఇకపై మీకు రోజు ఒక పొడుపు కథ సంధించబోతున్నాం.. తెలుగు భాషలోని ఈ అద్భుతమైన సంపదను ఆస్వాదించండి.

పొడుపు కథ: కాళ్లు ఉన్నా పాదాలు లేనిది ఏంటో చెప్పండి..?
Telugu Riddle
Ram Naramaneni
|

Updated on: May 22, 2026 | 7:19 PM

Share

తెలుగు భాషలో పొడుపు కథలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆలోచింపజేసే ఈ సరదా ప్రశ్నలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో వినిపించేవి. ముఖ్యంగా రాత్రి వేళల్లో అమ్మమ్మలు, తాతయ్యలు పిల్లలకు పొడుపు కథలు చెప్పి వారి తెలివితేటలను పరీక్షించేవారు. ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో కూడా ఈ పొడుపు కథలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి.

అలాంటి ఆసక్తికరమైన పొడుపు కథల్లో ఒకటి.. “కాళ్లు ఉన్నాయి.. కానీ పాదాలు లేవు.. అది ఏంటి?” మొదట వినగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మనిషికి కాళ్లు ఉంటే పాదాలు తప్పనిసరిగా ఉంటాయి కదా అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ వస్తుంది.

జవాబు: కుర్చీ!

అవును.. కుర్చీకి నాలుగు కాళ్లు ఉంటాయి. కానీ వాటికి పాదాలు ఉండవు. అందుకే ఈ పొడుపు కథకు సరైన సమాధానం “కుర్చీ”.

పొడుపు కథలు కేవలం వినోదం మాత్రమే కాదు. ఇవి ఆలోచనా శక్తిని పెంచుతాయి. భాషపై పట్టు పెరుగుతుంది. పిల్లల్లో చురుకుదనం వస్తుంది. పదాల అర్థాలను కొత్త కోణంలో అర్థం చేసుకోవడం నేర్పిస్తాయి. తెలుగు సంస్కృతిలో ఇవి ఒక మౌఖిక సంపదగా తరాల నుంచి కొనసాగుతున్నాయి. తెలుగు బాట, తెలుగు భాష గొప్పతనాన్ని, సంపదను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ పొడుపు కథల సిరీస్‌ను ప్రారంభించాం. ఇవి అన్ని వయసుల వారినీ ఆకట్టుకునేలా సరదాగా, విజ్ఞానవంతంగా ఉంటాయి. తెలుగు భాషలోని ఈ మేధోపరమైన ఆనందాన్ని అనుభవించడానికి, జ్ఞానాన్ని పొందడానికి ఈ పొడుపు కథలను అన్వేషించడం ఉత్తమ మార్గం.

Follow Us