Viral Video: వెర్రీకి అంతుండదంటే ఇదే.. 22 డిగ్రీల చలిలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్.. చివరికి..!
లైట్స్.. కెమెరా.. ఓవరాక్షన్. ఎస్.. ఇక్కడ ఓవరాక్షన్లు మాత్రమే చెయ్యబడును. ప్రీ-వెడ్డింగ్ షూట్స్ పేరుతో జరుగుతున్న ఓవరాక్షన్లకు అంతూపొంతూ లేకుండా పోయింది. లేటెస్ట్‌గా ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ ప్రాణం మీదకు తెచ్చింది ప్రీ-వెడ్డింగ్ షూట్. ఇట్లు మీ ఆర్యా వోరా అంటూ.. ఆ వీడియో, స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
లైట్స్.. కెమెరా.. ఓవరాక్షన్. ఎస్.. ఇక్కడ ఓవరాక్షన్లు మాత్రమే చెయ్యబడును. ప్రీ-వెడ్డింగ్ షూట్స్ పేరుతో జరుగుతున్న ఓవరాక్షన్లకు అంతూపొంతూ లేకుండా పోయింది. లేటెస్ట్‌గా ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ ప్రాణం మీదకు తెచ్చింది ప్రీ-వెడ్డింగ్ షూట్. ఇట్లు మీ ఆర్యా వోరా అంటూ ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరించడం ఆమె వృత్తి. ట్రావెలింగ్ వీడియోస్‌తో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎలివేషన్లొచ్చి ఆమెను బుల్లితెర సూపర్‌స్టార్‌గా మార్చేశాయి. దేవో కి దేవ్ మహదేవ్ అనే సీరియల్‌లో యాక్టర్‌గా మరింత పాపులరైన ఆర్యాఓరా.. ఇప్పుడు డేంజర్‌లో పడింది. ప్రీ-వెడ్డింగ్ షూట్ నా ప్రాణాలమీదకొచ్చింది.. అంటూ స్వయంగా సోషల్ మీడియా వేదికగా గొల్లుమంది ఆర్యా వోరా.
హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ.. ఇక్కడ టెంపరేచర్ మైనస్ 22 డిగ్రీలు. ఈ మంచు లోయకు ఎవరైనా వెళ్లారా.. నేను వెళ్లా.. ప్రీ-వెడ్ షూట్ చేశా.. అంటూ గర్వపడుతూనే.. ఓ వీడియో పోస్ట్ చేసింది ఆర్యా వోరా. స్ట్రాప్‌లెస్ బ్లాక్ గౌను వేసుకుని చలాకీగానే కనిపించారు ఆ వీడియోలో. కానీ.. ఆ ప్రీ-వెడ్ షూట్ నా ప్రాణం మీదకు తెచ్చింది అంటూ బోరున ఏడ్చినంత పనిచేసింది అదే ఇన్‌స్టాలో. విపరీతమైన చలితో స్పృహ తప్పి పడిపోయా.. పక్కనున్నవాళ్లు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఒక్కసారిగా శరీరంలో ఉష్ణోగ్రత పడిపోయి హైపోథెర్మియాకు గురయ్యా… అంటూ అభిమానులతో ఆ చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది ఆర్యవోరా. ఇప్పుడు మృత్యువుతో పోరాడుతోందట. ప్రీ-వెడ్ షూట్ అనే వేలంవెర్రికి పోయి ఖర్చయిపోయిన జీవితాలు ఇంకా ఎన్నో. డ్రీమ్ షాట్ కోసం చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తూ అనర్థాల్ని కొనితెచ్చుకున్నవాళ్లు ఎంతోమంది.
కేరళలో పడవ ప్రయాణం వికటించి నదిలో పడిపోయిన ఒక జంట గురించి ఇటీవలే విన్నాం. బాంద్రా బీచ్‌లో బండరాళ్ల మీద హొయలు పోయిన కపుల్.. వెనకొచ్చిన రాకాసి అలల్ని గమనించక, వాటి ధాటికి సముద్రంలో కలిసిపోయారు. డ్రోన్ వీడియో వచ్చి నెత్తిన పడ్డ సందర్భాలు కూడా కోకొల్లలు. ఇటీవల ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ-వెడ్ షూట్ చేసి ఉద్యోగాలు పోగొట్టుకుంది ఒక డాక్టర్ జంట. ఇలా.. ప్రీ వెడ్డింగ్ షూట్స్ పేరుతో కొనసాగుతున్న కొనసాగుతున్న పైత్యానికి ఇప్పుడీ ఆర్యా ఓరా ఉదంతాన్ని పరాకాష్టగా చెప్పుకోవచ్చు. మరి.. ఈ పెళ్లిముందు జరిగే వైపరీత్యాలకు ఎండ్ కార్డ్ పడేదెప్పుడో.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..