Watch Video: ఆ ట్రాఫిక్ రూల్స్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగుంటుందో, ట్రాఫిక్ జామ్ వీడియో వైరల్!

నేడు పట్టణాలు, పెద్ద పెద్ద సిటీలు అనే తేడా లేకుండా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. అత్యవసర సమయంలో చాలామంది ఆఫీసులకు వెళ్లలేక, ఆస్పత్రులకు చేరుకోలేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అనే ఈ సమస్య భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది.

Watch Video: ఆ ట్రాఫిక్ రూల్స్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగుంటుందో, ట్రాఫిక్ జామ్ వీడియో వైరల్!
Viral Video
Follow us
Balu Jajala

|

Updated on: Mar 22, 2024 | 10:34 AM

నేడు పట్టణాలు, పెద్ద పెద్ద సిటీలు అనే తేడా లేకుండా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. అత్యవసర సమయంలో చాలామంది ఆఫీసులకు వెళ్లలేక, ఆస్పత్రులకు చేరుకోలేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అనే ఈ సమస్య భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది. మనదేశంలో ట్రాఫిక్ జామ్ సమస్య చాలా ఎక్కువ. గ్రామాల్లోనే కాదు, దేశంలోని అనేక నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎవరికైనా అత్యవసరం వచ్చినా రోడ్డు దాటలేని పరిస్థితులున్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువ. అయితే చాలా దేశాల్లో రోడ్లపై జామ్ ఏర్పడినా, అంబులెన్స్‌లు లేదా ఇతర ముఖ్యమైన వాహనాలు సులభంగా వెళ్లగలిగేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో రోడ్డుకు ఒకవైపు నుంచి వాహనాలు సాఫీగా వస్తుండగా, మరోవైపు లాంగ్ జామ్ అయితే రోడ్డుకు అవతలవైపు, ఇవతలవైపు వాహనాలు ఆగికనిపించగా, మధ్యలో మరో వాహనం వెళ్లేలా స్థలం కేటాయించబడిఉంది. అగ్నిమాపక ట్రక్, పోలీసు లేదా ఇతర అత్యవసర సేవలకు చెందిన వాహనాలు అవసరమైన సమయంలో ఈ స్థలం గుండా సులభంగా వెళ్లేలా ఉపయోగపడుతుంది. వాహనదారులు తమ వాహనాలను రోడ్డుపక్కన ఎంత అద్భుతంగా పార్క్ చేసి మధ్యలో ఖాళీని వదిలేశారో కూడా వీడియోలో చూడవచ్చు. జర్మనీ, ఆస్ట్రియాలో కూడా ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.

ఈ అద్భుతమైన ట్రాఫిక్ జామ్ వీడియో Rainmaker1973 అనే IDతో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. కేవలం 13 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు మూడు లక్షల 22 వేలకు పైగా వీక్షించగా, రెండు వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘ట్రాఫిక్ జామ్ అయినప్పుడు డ్రైవర్లు ఇరువైపులా పక్కకు వెళ్లి, అత్యవసర వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఓపెన్ లేన్‌ను రూపొందించాలని జర్మనీలో ఒక చట్టం ఉంది. ఈ రకమైన పద్ధతి ప్రతి దేశంలో తప్పనిసరిగా ఉండాలి. ఇది ప్రాణాలను కాపాడుతుంది’ అని కామెంట్ చేయగా, ఈ ట్రాఫిక్ నిబంధనలను భారతదేశంలో మాత్రమే అమలు చేయాలి. ఇది అవసరం’ అంటూ మరికొందరు రియాక్ట్ అయ్యారు.