Crying Rooms: రండి.. ఓ రేంజ్ లో ఏడ్చేయండి, ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేక పార్లర్లు.. ఎక్కడో తెలుసా
మనిషి జీవితంలో ఏడుపు, నవ్వు కామన్. ఒక్కోసారి మనుషుల జీవితంలో సంతోషం వచ్చినప్పుడు ఆనందంగా నవ్వడం మొదలుపెడతారు, కొన్నిసార్లు దుఃఖం వచ్చినప్పుడు మనుషులు బాధపడతారు, అలాంటి పరిస్థితుల్లో కళ్లలో నీళ్లు రావడం సహజం. అయితే కొందరు మాత్రం ఏడవాలనుకుంటున్నారు, కానీ వారు ఏడుస్తున్నట్లు ఇతరులకు కనిపించకూడదు.
మనిషి జీవితంలో ఏడుపు, నవ్వు కామన్. ఒక్కోసారి మనుషుల జీవితంలో సంతోషం వచ్చినప్పుడు ఆనందంగా నవ్వడం మొదలుపెడతారు, కొన్నిసార్లు దుఃఖం వచ్చినప్పుడు మనుషులు బాధపడతారు, అలాంటి పరిస్థితుల్లో కళ్లలో నీళ్లు రావడం సహజం. అయితే కొందరు మాత్రం ఏడవాలనుకుంటున్నారు, కానీ వారు ఏడుస్తున్నట్లు ఇతరులకు కనిపించకూడదు. అందుకే అలాంటివాళ్ల కోసం క్రైయింగ్ రూమ్స్ తీసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేకంగా పార్లర్ క్రియేట్ చేసి.. జనాలు కావాలంటే వచ్చి కన్నీళ్లు పెట్టుకుని తమ కోపాన్ని వెళ్లగక్కవచ్చు.
ఈ ప్రత్యేకమైన పార్లర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడింది. దీని పేరు ‘సోబ్ పార్లర్’. ఈ పార్లర్‌లో ఒక ప్రైవేట్ క్రై రూమ్ తయారు చేయబడింది. ఇక్కడ ఏడ్చే సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ గదికి వెళ్లడం ద్వారా ఒక వ్యక్తి ఏడ్చవచ్చు. దీంతో ఈ మనసు తేలికపడుతుంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ప్రత్యేకమైన పార్లర్‌ను గత సంవత్సరం ఆంథోనీ విలోట్టి అనే వ్యక్తి ప్రారంభించాడు.
ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి సమస్యతో సతమతమవుతున్నారని ఆంటోనీ చెప్పారు. కొంతమంది ఇంట్లో సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతారు, మరికొందరు ఆఫీసు ఒత్తిడితో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఏడ్చేయాలని అనిపిస్తుంది. మనసుతీరా ఎడ్వడంతో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. చాలా మంది కుటుంబ బాధ్యతలు, ఇంటి పనులతో ఒత్తడి బారిన పడుతున్నారు. అలాంటివాళ్లు ఎక్కువగా ఈ క్రైయింగ్ రూమ్స్ రావడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. తమలాంటివాళ్లు వస్తుండటంతో ఒకరి బాధలు తెలుసుకొని రిలీఫ్ అవుతున్నారు.
సోబ్ పార్లర్‌లోని క్రై రూమ్‌లో, కన్నీటి ఆకారపు అద్దాలు, దిండ్లు వంటి కన్నీళ్లు తెప్పించేవి కనిపిస్తాయి అదే సమయంలో భావోద్వేగ పాటలు కూడా ఇక్కడ వినవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరికి 10 నిమిషాలు ఏడ్చిన తర్వాతే ఓదార్పు లభిస్తుందని, మరికొంత మందికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆంథోనీ చెప్పారు. చాలామంది ఇక్కడకు వస్తుండటంతో ఈ క్రైయింగ్ రూమ్స్ చర్చనీయాంశమవుతున్నాయి.