రోజూ పరగడుపున ఓ వెల్లుల్లి రెబ్బ తిని చూడండి.. మీ కళ్లను మీరే నమ్మలేరు!
08 January 2025
TV9 Telugu
TV9 Telugu
కొందరు ఎందుకో వెల్లుల్లిని వంటల్లో దూరంగా పెడతారు. అలా చేయడం అందాన్నీ, ఆరోగ్యాన్నీ దూరం పెట్టడమే. ఎందుకంటే ఉల్లిలానే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
TV9 Telugu
తరచూ నీరసంగా అనిపించేవారు రోజూ ఒకట్రెండు వెల్లుల్లి రెబ్బల్ని నేరుగా తీసుకోవాలి. దీన్లో అధిక మోతాదులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి
TV9 Telugu
మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు వచ్చే కీళ్లనొప్పులను దూరం చేస్తుంది
TV9 Telugu
పచ్చి వెల్లుల్లిలో ఉండే అలిసిన్ హృద్రోగాలకూ, సెలీనియమ్ క్యాన్సర్లకూ అడ్డుకట్ట వేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేస్తుంది. అందుకే రోజుకో వెల్లుల్లి రెబ్బ తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
ప్రతిరోజూ ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా చేయడం వల్ల వెల్లుల్లిలోని అల్లిసిన్ వ్యాధికారక క్రిములతో పోరాడుతుంది
TV9 Telugu
వెల్లుల్లి రెబ్బలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
ఉదయం పూట ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని, నీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటు లక్షణాలు తగ్గుతాయి. వెల్లుల్లి శరీరంలో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది
TV9 Telugu
కాలేయం, మూత్రాశయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. విరేచనాలతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తింటే ఉపశమనం కలుగుతుంది