Viral Video: వీళ్ల టాలెంట్ చూస్తే మతిపోవాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో తరచూ యాక్టీవ్‎గా ఉంటారు. అప్పుడప్పుడూ ఇతరులు పెట్టిన పోస్టులపై స్పందిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా కొత్తగా, క్రియేటివిటీగా ఆలోచిస్తే వారిని అభినందిస్తూ ఉంటారు. తాజాగా తనకు నచ్చిన ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Viral Video: వీళ్ల టాలెంట్ చూస్తే మతిపోవాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
Anand Mahindra
Follow us
Srikar T

|

Updated on: Dec 31, 2023 | 6:28 PM

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో తరచూ యాక్టీవ్‎గా ఉంటారు. అప్పుడప్పుడూ ఇతరులు పెట్టిన పోస్టులపై స్పందిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా కొత్తగా, క్రియేటివిటీగా ఆలోచిస్తే వారిని అభినందిస్తూ ఉంటారు. తాజాగా తనకు నచ్చిన ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా మనం ఫర్నీచర్ ను ఇంట్లో సౌకర్యం కోసం వినియోగించుకుంటాం. అయితే ఈ ఇద్దరు యువకులు కొత్తగా అలోచించారు. వీరి ఆలోచనకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర వీరి టాలెంట్ ను ప్రశంసించారు. ఇలా వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు ఆన్‌లైన్ ద్వారా సోఫాను ఆర్డర్ చేశారు. ఆ సోఫాకు చక్రాలు, మోటార్ అమర్చారు. తమ సాంకేతికతను జోడించి ఆ ఫర్నిచర్ ను ఓ వెహికల్‌గా మార్చేశారు. రిమోట్ సహాయంతో దానిపై ఇద్దరూ కూర్చుని ఊరంతా తిరుగుతూ కనిపించారు. దీనిని వారు సరదా కోసం చేసినప్పటికీ అందులోని ప్రతిభ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఉన్న యుగంలో ఆటోమొబైల్ స్కిల్స్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. వీరికి సరైన శిక్షణ ఇస్తే మాత్రం మాణిక్యాల్లా మరిపోతారు. ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తను దృష్టిని ఆకర్షించగలిగారంటే అది సాధారణమైన విషయం కాదు. వీరిని ప్రశంసిస్తూ మహేంద్రా ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

“ఇది కేవలం ఓ సరదా ప్రాజెక్ట్. కానీ, దానిని తయారు చేయడంలో వారు పెట్టిన శ్రద్ధ, ఆటోమొబైల్ స్కిల్ మాత్రం అద్భతం అన్నారు. ఏ దేశమైనా ఆటోమొబైల్ రంగంలో దిగ్గజంగా మారాలంటే ఇలాంటి క్రియేటివిటీ ఆలోచనలు ఉన్న ఇంజినీర్లు అవసరం అని ట్వీట్ చేశారు. ఇలాంటి వాహనాన్ని భారత్‌లో రిజిస్టర్ చేయడానికి ఆర్టీవో ఆఫీస్‌కు తీసుకెళితే అక్కడ అధికారి ఎలా ఫీల్ అవుతాడో చూడాలని ఉందని” ఆనంద్ కామెంట్ చేశారు. కాగా, ఆనంద్ షేర్ చేసిన ఈ వైరల్ వీడియో 4.6 లక్షల వ్యూస్ దాటింది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే మన దేశం భవిష్యత్తులో నంబర్ వన్ గా మరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..