దేశంలోనే అతి చిన్న రైలు..కేవలం 3 కోచ్‌లతో ప్రయాణం మరుపురాని జ్ఞాపకం..

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. అలాంటి మనదేశంలో ఒక రైలు అత్యల్ప దూరం ప్రయాణిస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశంలో అతి తక్కువ దూరం ప్రయాణించే అతి చిన్న రైలు ప్రయాణికులకు మాత్రం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఇదో అందమైన, మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది...

దేశంలోనే అతి చిన్న రైలు..కేవలం 3 కోచ్‌లతో ప్రయాణం మరుపురాని జ్ఞాపకం..
India's Shortest Train Journey

Updated on: Nov 11, 2025 | 12:52 PM

ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారతదేశ రైలు నెట్‌వర్క్ ఎంతో విశాలమైనది. ప్రతిరోజూ వేలాది రైళ్లు నడుస్తాయి. కానీ, భారతదేశంలోని అతి చిన్న రైలు గురించి మీకు తెలుసా? అలాంటి ఒక ప్రత్యేక రైలు కేరళలో ఉంది. ఇది కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. కేవలం మూడు కోచ్‌లు మాత్రమే కలిగి ఉంటుంది.

ఈ రైలు చిన్నదిగా ఉండటమే కాకుండా దాని అందమైన మార్గాలు, ప్రశాంత వాతావరణం కారణంగా ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. దేశంలోనే అతి చిన్న రైలు అని పిలువబడే ఇది కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ నుండి ఎర్నాకుళం జంక్షన్ వరకు నడుస్తుంది. ప్రయాణం చిన్నది. రైలు ఒక స్టాప్‌తో 9 కి.మీ దూరాన్ని 40 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఈ ఆకుపచ్చ రంగు DEMU రైలు రోజుకు రెండుసార్లు, ఉదయం, సాయంత్రం రెండు పూటలా నడుస్తుంది.

కేరళలోని దట్టమైన అడవులు, పొలాలు, నదీ తీరాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. ఈ రైలులో స్థానికులు చాలా అరుదుగా ప్రయాణిస్తారు. ఇది 10-12 మంది ప్రయాణీకులను మాత్రమే తీసుకువెళుతుంది, కానీ 300 మంది సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఈ 9 కి.మీ ప్రయాణాన్ని ఒకే స్టాప్‌తో 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. కేరళలోని పచ్చని అడవులు, పొలాలు, నదీ తీరాల గుండా ప్రయాణించే ఈ రైలు ప్రయాణీకులకు ప్రకృతి అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..