కుక్క కోసం వెరైటీ సూట్‌కేసు కొన్న ఎన్నారై.. దీని ధర ఎన్ని లక్షలో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

డాక్టర్ మల్టీమీడియా సీఈఓ అజయ్ ఠాకూర్ తన కుక్క కోసం లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందిన బోన్ ట్రంక్ అనే ఖరీదైన సూట్‌కేస్‌ను కొన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన లూయిస్ విట్టన్ స్టోర్‌లోకి వెళ్లి నా కుక్కకు కొన్ని వస్తువులు తీసుకోవాలని అనుకుంటాను అని అంటున్నారు.

కుక్క కోసం వెరైటీ సూట్‌కేసు కొన్న ఎన్నారై.. దీని ధర ఎన్ని లక్షలో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
Louis Vuitton Suitcase
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 01, 2024 | 3:59 PM

చాలా మందికి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. కొందరు పిల్లుల్ని పెంచుకుంటే, మరికొందరు కుక్కల్ని పెంచుకుంటారు. కొందరు ఉడుత, కుందేలును కూడా పెంచుకోవటం సోషల్ మీడియా ద్వారా మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇకపోతే వాటిని తమ కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమిస్తుంటారు. వాటి కోసం ఖరీదైన ఆహారం, సౌఖర్యవంతమైన బెడ్‌, సోఫాలాంటివి కూడా తమ పెంపుడు జంతువుల కోసం కొనుగోలు చేస్తుంటారు. అలాగే ఒక వ్యక్తి తన పెంపుడు జంతువు కోసం ఏకంగా రూ. 14 లక్షల విలువైన బోన్ ట్రంక్ అనే లూయిస్ విట్టన్ డాగ్‌ సూట్‌కేస్‌ను కొనుగోలు చేశాడు.

డాక్టర్ మల్టీమీడియా సీఈఓ అజయ్ ఠాకూర్ తన కుక్క కోసం లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందిన బోన్ ట్రంక్ అనే ఖరీదైన సూట్‌కేస్‌ను కొన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన లూయిస్ విట్టన్ స్టోర్‌లోకి వెళ్లి నా కుక్కకు కొన్ని వస్తువులు తీసుకోవాలని అనుకుంటాను అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఆయన కుక్క కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎముక ఆకారంలో ఉన్న హార్డ్‌షెల్ సూట్‌కేస్‌ను చూపించారు.. ఈ సూట్‌కేస్‌తో పాటు పాలిష్ చేసిన వుడెన్ ట్రే, రెండు బౌల్స్ కూడా వస్తాయి. అజయ్ కొనుగోలు చేసిన సూట్‌కేస్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్‌కు చెందినది. దీనికి కంపెనీ ‘బోన్ ట్రంక్’ అని పేరు పెట్టింది. ఇది ఎముక ఆకారంలో ప్రత్యేకంగా రూపొందించిన సూట్‌కేస్. కుక్క కూర్చోవడానికి ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకత.

View this post on Instagram

A post shared by Ace (@acerogersceo)

ఈ లూయిస్ విట్టన్ బోన్ ట్రంక్ ధర 20,000 డాలర్లు అంటే అక్షరాల రూ.14 లక్షలు అని రాశారు. ఈ వీడియో చూసిన కొంతమంది ఈయన నిర్ణయాన్ని అభినందిస్తూ, తన పెంపుడు జంతువును చాలా గొప్పగా ప్రేమిస్తున్నారుగా అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..