Fact Check: వేసవిలో ట్యాంక్‌ ఫుల్ చేయిస్తే వాహనాలకు ప్రమాదామా.? క్లారిటీ ఇచ్చిన ఇండియన్‌ ఆయిల్‌..

Fact Check: సోషల్‌ మీడియా (Social) విప్లవం తర్వాత సమాచార మార్పిడిలో వేగం పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వెంటనే అరచేతిలో ప్రత్యక్షమయ్యే రోజులు వచ్చేశాయి. అయితే ఈ క్రమంలోనే ఫేక్‌ న్యూస్‌ (Fake News) వ్యాప్తి కూడా అదే స్థాయిలో...

Fact Check: వేసవిలో ట్యాంక్‌ ఫుల్ చేయిస్తే వాహనాలకు ప్రమాదామా.? క్లారిటీ ఇచ్చిన ఇండియన్‌ ఆయిల్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 10, 2022 | 10:54 AM

Fact Check: సోషల్‌ మీడియా (Social) విప్లవం తర్వాత సమాచార మార్పిడిలో వేగం పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వెంటనే అరచేతిలో ప్రత్యక్షమయ్యే రోజులు వచ్చేశాయి. అయితే ఈ క్రమంలోనే ఫేక్‌ న్యూస్‌ (Fake News) వ్యాప్తి కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. ఎవరికి వారు తమ అభిప్రాయాలను నేరుగా సోషల్‌ మీడియాలో వేదికగా పంచుకుంటున్నారు. దీంతో నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియక నెటిజన్లు తికమక పడే పరిస్థితి వచ్చింది. ప్రముఖ సంస్థల పేర్లతో కూడా తప్పుడు సమాచారం వైరల్‌ అయ్యే ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఓ వార్తనే నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) పేరుతో ఓ వార్త నెట్టింట సందడి చేస్తోంది.

ఇంతకీ ఈ వార్తలో ఏముందంటే.. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వాహనదారులకు ఇండియన్‌ ఆయిల్‌ హెచ్చరిక పేరుతో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరూ వాహనాలకు ట్యాంక్‌ ఫుల్‌ చేసుకోవద్దని, రోజులో ఒక్కసారైనా పెట్రోల్‌ ట్యాంక్‌ తెరవడం ద్వారా లోప గ్యాస్‌ బయటకు వెళుతుంది అంటూ సమాచారం వైర్‌ అయింది. అయితే తమ సంస్థ పేరుతో వైరల్‌ అవుతున్న వార్తపై ఇండియన్‌ ఆయిల్‌ అధికారికంగా స్పందించింది.

నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్తలో నిజం లేదని తేల్చి చెప్పింది. వాహన తయారీ సంస్థలు వాహనాలను తయారు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని, కాబట్టి ఎండకాలమైనా, చలికాలమైనా ట్యాంక్‌ ఫుల్ చేయిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ట్వీట్ చేసింది. నిజానికి ఇండియన్‌ ఈ క్లారిటీని 2019లో ఇచ్చింది. అయితే తాజాగా మరో సారి ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోన్న నేపథ్యంలో ఇండియన్‌ ఆయిల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

Also Read: MP Ramp Walk: పొలిటిషన్ అయితే ఫ్యాషన్ ఉండకూడదా..! ర్యాంప్‌ వాక్‌ చేసి ర్యాంప్ ఆడించిన ఆప్‌ ఎంపీ..

Liver Health: ఇవి తీసుకుంటే కాలేయం ప్రమాదంలో పడినట్టే.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..

Covid Vaccine Booster: నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు.. రూ.225కే టీకా..