Telugu News » Photo gallery » Foods bad for Liver: These 5 things can be harmful for liver in Telugu
Liver Health: ఇవి తీసుకుంటే కాలేయం ప్రమాదంలో పడినట్టే.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..
Shaik Madarsaheb |
Updated on: Apr 10, 2022 | 9:36 AM
Liver Health Tips: జీవనశైలితోపాటు తీసుకునే ఆహారం శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి అవయవాలలో ఒకటి కాలేయం (Liver). ఇది ఒకసారి దెబ్బతింటే.. ఆరోగ్యంగా మార్చడం కష్టమవుతుంది. అందుకే లివర్ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. లివర్ సమస్యలకు దూరంగా ఉండాలంటే.. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. కాలేయానికి హాని కలిగించేవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Apr 10, 2022 | 9:36 AM
శీతల పానీయాలు: సోడాతో తయారుచేసిన శీతల పానీయాలు రెగ్యులర్ గా తీసుకుంటే కాలేయానికి చాలా నష్టం వాటిల్లుతుంది. అలాగే వీటిలో ఉండే చక్కెర కాలేయాన్ని కొవ్వుగా మారుస్తుంది.
1 / 6
ఎనర్జీ డ్రింక్స్: అవి తక్షణ శక్తిని ఇవ్వగలగే పదార్థాలను కలిగి ఉంటాయి. కానీ వాటిని నిరంతరం తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అనేక పానీయాలలో హానికరమైన కెమికల్స్‌ను ఉపయోగిస్తారు.
2 / 6
క్రీమీ మిల్క్: చాలా మంది పాలలో మీగడను ఇష్టపడతారు. కానీ ఇది నిరంతరం తాగితే కొవ్వు పెరగడంతోపాటు కాలేయం సమస్యలు వస్తాయి. కొవ్వును అధికంగా తీసుకుంటే ఇతర భాగాలకు కూడా హాని కలుగుతుంది.
3 / 6
ఆల్కాహాల్: ఆల్కాహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాలేయం పాడవడానికి ముఖ్య కారణం మద్యపానం కారణమని పలు అధ్యయనాల్లో తేలింది. ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే అది ప్రాణాంతకం అని కూడా పేర్కొంటున్నారు నిపుణులు.
4 / 6
టీ: కొందరికి టీ తాగే అలవాటు ఉంటుంది. అంటే రోజుకు మూడు నాలుగు సార్లు టీ తాగుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం టీలో ఉండే కెఫిన్ కాలేయానికి మంచిది కాదు. ప్రజలు పాలకు బదులుగా బ్లాక్ టీ తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. పరిమితంగా తీసుకోవడం మంచిది.
5 / 6
ఈ పానీయాలకు దూరం ఉండటం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.