AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: లక్కీ భాస్కర్ మాదిరి లచ్చలు.. లచ్చలు లాగేసింది.. కట్ చేస్తే.. సీన్ చిరిగి చాటయ్యింది

కోటాలోని ఐసీఐసీఐ బ్యాంక్ డీసీఎం బ్రాంచ్‌లో చోటు చేసుకున్న మోసాల కథ ఇది. అక్కడే పని చేస్తున్న ఓ మహిళా బ్రాంచ్ మేనేజర్ ఏకంగా రూ. 4.58 కోట్లను.. ఏం చేసిందో తెలిస్తే మీరు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఆ స్టోరీ ఇదే.

Viral: లక్కీ భాస్కర్ మాదిరి లచ్చలు.. లచ్చలు లాగేసింది.. కట్ చేస్తే.. సీన్ చిరిగి చాటయ్యింది
Trending
Ravi Kiran
|

Updated on: Jun 07, 2025 | 12:48 PM

Share

కోటా నగరంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మహిళా రిలేషన్‌షిప్ మేనేజర్‌ చేసిన ఘోర మోసం దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. బ్యాంక్ ఖాతాదారుల విశ్వాసాన్ని తాకట్టు పెట్టి రూ.4 కోట్ల 58 లక్షలు డైవర్ట్ చేసిన ఘాతుకం వెలుగు చూసింది. మేనేజర్ సాక్షి గుప్తా.. మూడు సంవత్సరాల పాటు ఖాతాదారుల మొబైల్ నెంబర్లు మార్చి.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు తాకట్టు పెట్టి.. డెబిట్ కార్డులు దుర్వినియోగం చేసి, ఈ డబ్బును బీభత్సంగా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టింది. కానీ మార్కెట్‌లో లాభాలేమీ రావడం లేదు. అంతా నష్టమే. బ్యాంక్ విచారణలో అసలు మోసం బయటపడింది. ఏకంగా 110 ఖాతాల నుంచి డబ్బులు తీసుకెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు.

ఓ మహిళా కస్టమర్ ఖాతా నుంచి రూ.3.22 కోట్లు మాయమయ్యాయి. బ్యాంక్ మేనేజర్ తన తండ్రి పేరుతో కూడా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. “ఆమె 2020 నుంచి 2023 మధ్య కాలంలో 41 మంది ఖాతాదారుల డేటాను ఉపయోగించి అక్రమంగా డబ్బులు తీసుకుంది. ఫోన్ నంబర్లు మార్చి, పిన్ కోడ్లు, ఓటీపీలు దుర్వినియోగం చేసింది. ఇంకా విచారణ కొనసాగుతోంది.”

31 మంది కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముందుగానే మూసి.. రూ.1.34 కోట్లు ఇతర ఖాతాల్లోకి డైవర్ట్ చేసింది. రూ.3.4 లక్షల మేరకు పర్సనల్ లోన్ కూడా నకిలీ పద్ధతుల్లో తీసుకుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంస్టా కియోస్క్, డిజిటల్ ట్రాన్సాక్షన్‌ చానల్స్ అన్నీ సాక్షి చేతుల్లోకి వెళ్లిపోయాయి. కస్టమర్లను నమ్మించి ఫేక్ ఫారాలు కూడా సంతకం చేయించుకుంది. అలా బ్యాంకులో పని చేసిన మూడేళ్లపాటు ఈ మోసం కనీసం ఆమె కుటుంబానికి కూడా తెలియకుండా సాగింది. ఇప్పుడు కుటుంబ సభ్యుల కాల్ డేటా సైతం పోలీసులు గమనిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డబ్బుల దుర్వినియోగం చేసిన మహిళా మేనేజర్ సాక్షి గుప్తా.. బ్యాంక్‌లోనే పని చేసిన శరద్ గుప్తాను 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె భర్త మరో ప్రైవేట్ బ్యాంక్‌లో పని చేస్తున్నాడు. కేసు విచారణలో అతడి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాక్షి గుప్తా అకౌంట్ నుంచి తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోనూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. వారి ఫోన్ నంబర్లతో ఖాతాదారుల ఫోన్లను మార్చేసింది. ఈ మోసం ఒంటరిగా జరగలేదన్న అనుమానాల నేపథ్యంలో.. పోలీసులు ఇతరులతో సంబంధాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. మహిళా మేనేజర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు.. బ్యాంక్‌కు చెందిన 110 ఖాతాదారుల డబ్బులను తిరిగి చెల్లించినట్టు పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..