ఫెన్సింగ్ ఎక్కి చక్కా పోయిందెవరో తెలుసా ?
అది ఫ్లోరిడా లోని జాక్సన్ విల్లీ ప్రాంతం. అక్కడో మిలిటరీ బేస్ ఉంది. సాధారణంగా సైనిక స్థావరం అంటే బలమైన వైర్ ఫెన్సింగ్ తో ఎవరూ ఎంటర్ కావడానికి వీల్లేకుండా.. దుర్భేద్యంగా ఉంటుంది. కానీ ఓ మొసలికి మాత్రం ఇదేమీ పట్టినట్టు లేదు. ఎక్కడినుంచి వచ్చిందో గానీ.. ఓ వైర్ ఫెన్సింగ్ ఎక్కి అవతలకి నింపాదిగా.. చక్కా పోయింది. ఆ ప్రాంతంలో కారులో వెళ్తున్న క్రిస్టినా స్టెవార్ట్ అనే మహిళా ఇది చూసి.. కారు అపి.. ఆశ్చర్యపోతూనే […]
అది ఫ్లోరిడా లోని జాక్సన్ విల్లీ ప్రాంతం. అక్కడో మిలిటరీ బేస్ ఉంది. సాధారణంగా సైనిక స్థావరం అంటే బలమైన వైర్ ఫెన్సింగ్ తో ఎవరూ ఎంటర్ కావడానికి వీల్లేకుండా.. దుర్భేద్యంగా ఉంటుంది. కానీ ఓ మొసలికి మాత్రం ఇదేమీ పట్టినట్టు లేదు. ఎక్కడినుంచి వచ్చిందో గానీ.. ఓ వైర్ ఫెన్సింగ్ ఎక్కి అవతలకి నింపాదిగా.. చక్కా పోయింది. ఆ ప్రాంతంలో కారులో వెళ్తున్న క్రిస్టినా స్టెవార్ట్ అనే మహిళా ఇది చూసి.. కారు అపి.. ఆశ్చర్యపోతూనే వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ‘ ఆ మొసలి ఫెన్సింగ్ ఎక్కి అవతలకి దిగి అదృశ్యమైంది. భలే..భలే.. అంటూ కామెంట్ పెట్టింది. ఇది చూసినవాళ్లు రకరకాలుగా స్పందించారు. ‘ క్రేజీ అండ్ శ్కేరీ ‘ (క్రేజీగానూ, భయం గొలిపేదిగానూ ఉంది) అని ఒకరంటే.. ‘ ఈ సీన్ కాస్త ఆశ్చర్యంగా ఉంది.. ఎనీ హౌ.. థ్యాంక్యూ ‘ అని స్పందించారు. అయితే ఈ ‘ అనుకోని అతిథి ‘ పట్ల మిలిటరీ బేస్ అధికారులు పెద్దగా స్పందించలేదు. ‘ మీరు ఫ్లోరిడాకు కొత్తగా వఛ్చిన వారైనా.. లేదా ఏళ్ళ తరబడి ఇక్కడ ఉంటున్నా.. నీటిని చూశారంటే మాత్రం ఇక్కడ మొసలి వఛ్చినట్టే భావించండి ‘ అని వాళ్ళూ ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు. పైగా ‘ ఈ బేస్ లో ఎన్నో మొసళ్ళు ఉన్నాయి.. అవి మా భద్రతా చర్యలను గౌరవించవు ‘ అని మరో సరదా కామెంటూ చేశారు.
https://www.facebook.com/stinabear/videos/10205681431111646/?t=0