చెన్నై బీచ్‌లో.. అర్ధరాత్రి అద్భుతం.. డేంజర్‌కు సంకేతమా.?

ఆదివారం అర్ధరాత్రి చెన్నై బీచ్‌లో ఓ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. సముద్రపు అలలు సరికొత్త రంగులతో యాత్రికులను కనువిందు చేశాయి. అలలు అన్ని నీలిరంగులోకి మారి మెరిసిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అలలు ఇలా మారడం చాలా ప్రమాదకరం అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయో లుమినిసెన్స్‌గా పేర్కొనే ఈ పరిణామం సముద్రంలోని నోక్టిలూకా సింటిలియన్స్‌ అనే సూక్ష్మజీవుల కారణంగా ఏర్పడుతుందని పర్యవరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక […]

  • Ravi Kiran
  • Publish Date - 6:29 pm, Tue, 20 August 19
చెన్నై బీచ్‌లో.. అర్ధరాత్రి అద్భుతం.. డేంజర్‌కు సంకేతమా.?

ఆదివారం అర్ధరాత్రి చెన్నై బీచ్‌లో ఓ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. సముద్రపు అలలు సరికొత్త రంగులతో యాత్రికులను కనువిందు చేశాయి. అలలు అన్ని నీలిరంగులోకి మారి మెరిసిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అలలు ఇలా మారడం చాలా ప్రమాదకరం అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బయో లుమినిసెన్స్‌గా పేర్కొనే ఈ పరిణామం సముద్రంలోని నోక్టిలూకా సింటిలియన్స్‌ అనే సూక్ష్మజీవుల కారణంగా ఏర్పడుతుందని పర్యవరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక ఈ సూక్ష్మ జీవులు ఉన్న ప్రాంతంలో చేపలు, ఇతర జలచరాలు కూడా జీవించలేవని వారు అంటున్నారు.