Viral Video: ఒక్క చెవి రింగు కోసం ఇంత మంది వెతుకుతున్నారా.. అసలు ఏం జరిగిందంటే..
సాధారణంగా బయటకు వెళ్లి వచ్చినప్పుడు ఒక్కోసారి ఏదో ఒక వస్తువును పోగొట్టుకుంటూ ఉంటాం. అందులోనూ ఇంట్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి ఉంటే ఇక చెప్పాల్సిన పని లేదు. ఏవో ఒకటి పోతూనే ఉంటాయి. అవి చిన్న చిన్నవే అయినా మనసుకు నచ్చినవి అయితే చాలా బాధగా ఉంటుంది. ఇక కొన్ని రోజుల తర్వాత దాన్ని మర్చిపోతాం. ఇక్కడ ఇలానే ఈ యువతి కూడా ఓ చెవి రింగును పోగొట్టుకుంది. ఓ మ్యూజిక్ కచేరీ తర్వాత తిరిగి వస్తుండగా....
సాధారణంగా బయటకు వెళ్లి వచ్చినప్పుడు ఒక్కోసారి ఏదో ఒక వస్తువును పోగొట్టుకుంటూ ఉంటాం. అందులోనూ ఇంట్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి ఉంటే ఇక చెప్పాల్సిన పని లేదు. ఏవో ఒకటి పోతూనే ఉంటాయి. అవి చిన్న చిన్నవే అయినా మనసుకు నచ్చినవి అయితే చాలా బాధగా ఉంటుంది. ఇక కొన్ని రోజుల తర్వాత దాన్ని మర్చిపోతాం. ఇక్కడ ఇలానే ఈ యువతి కూడా ఓ చెవి రింగును పోగొట్టుకుంది. ఓ మ్యూజిక్ కచేరీ తర్వాత తిరిగి వస్తుండగా.. యువతి చెవి రింగును పోగొట్టుకుంది. అయితే ఆ చెవి రింగు వెతకడానికి ఎంతో మంది ఆమెకు హెల్ప్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.
యూఎస్‌లోని మైనేలో ఒక అమ్మాయి మ్యూజిక్ కన్సెట్ నుంచి తిరిగి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే రోడ్డు మీద ఆమె ఇయర్ రింగును పోగొట్టుకున్నట్లు గుర్తించింది. దీంతో ఈ యువతి చెవి రింగును వెతుక్కుంటూ ఉంది. అయితే అక్కడే ఉన్నవారు ఈ విషయం తెలుసుకుని ఆమెకు హెల్ప్ చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20 మంది దాకా ఆ యువతికి హెల్ప్ చేశారు. లైన్ బై లైన్ వెళ్తూ చెవి రింగును వెతికేందుకు సహాయం చేశారు. ఇదంతా పక్కనే ఉన్న యువతి వీడియో రికార్డ్ చేసింది. అనంతరం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇయర్ రింగు దొరకకపోయినా పర్వాలేదు. ఇంత మంది లవ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని షేర్ చేసింది.
ఎమ్మా హ్యూస్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఎంతో సంతోషంగా కామెంట్స్ చేశారు. ‘నిజంగానే మీరు అదృష్ట వంతులు’.. ‘ఇంత మంది మీకు వెతకడానికి హెల్ప్ చేస్తున్నారా’.. ‘వారంతా నిజంగానే చాలా మంచివాళ్లు’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..