బిడ్డా..! నువ్వెళ్లిపోయావా..? గజ రాజుల ‘నివాళి’

కుటుంబసభ్యులు మనల్ని శాశ్వతంగా వదిలి వెళితే ఆ బాధ వర్ణించలేనిది. అయితే ఈ బాధ మనకే కాదు మూగజీవులకు కూడా ఉంటుంది. దానికి ఉదాహరణలుగా ఇప్పటికే ఎన్నో ఫొటోలు, వీడియోలు మనం చూసే ఉంటాం. తాజాగా అలాంటి మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. This will move you !! Funeral procession of the weeping elephants carrying dead body of the child elephant. The family just […]

బిడ్డా..! నువ్వెళ్లిపోయావా..? గజ రాజుల ‘నివాళి’
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 11, 2019 | 3:14 PM

కుటుంబసభ్యులు మనల్ని శాశ్వతంగా వదిలి వెళితే ఆ బాధ వర్ణించలేనిది. అయితే ఈ బాధ మనకే కాదు మూగజీవులకు కూడా ఉంటుంది. దానికి ఉదాహరణలుగా ఇప్పటికే ఎన్నో ఫొటోలు, వీడియోలు మనం చూసే ఉంటాం. తాజాగా అలాంటి మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరణించిన తన పిల్ల మృతదేహాన్నిమోసుకుంటూ అడవిలో నుంచి రోడ్డుపైకి వచ్చింది ఓ ఏనుగు. దాని వెంటనే అక్కడికి వచ్చిన మరిన్ని ఏనుగులు పిల్ల మృతి పట్ల నిమిషం పాటు మౌనం పాటించాయి. అనంతరం మరో ఏనుగు.. మృతదేహాన్ని తొండంతో పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనను దూరం నుంచి గమనించిన అటవీ అధికారి పర్వీన్ కస్వాన్ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.