తాతా.. లే ఇంటికి వెళ్దాం.. మనసును కదిలిస్తోన్న ఫొటో

అప్పటివరకు తనకు ఎన్నో కథలు చెప్పిన తాత, అచేతనంగా పడి ఉండటం చూసిన ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. తాతా.. లే ఇంటికి వెళ్దాం అంటూ తన తాత మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తూ కనిపించాడు.

తాతా.. లే ఇంటికి వెళ్దాం.. మనసును కదిలిస్తోన్న ఫొటో
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 9:21 AM

అప్పటివరకు తనకు ఎన్నో కథలు చెప్పిన తాత, అచేతనంగా పడి ఉండటం చూసిన ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. తాతా.. లే ఇంటికి వెళ్దాం అంటూ తన తాత మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అందరి మనసును కదిలిస్తోంది.

కాగా జమ్ముకశ్మీర్‌లోని సోపూర్‌లో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అదే సమయంలో మూడేళ్ల బాలుడితో కలిసి ఓ వ్యక్తి ఆ దారిలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పల్లో ఆ వ్యక్తికి రెండు తూటాలు తగిలి.. అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆ బాలుడు అక్కడే కూర్చొని రోదించాడు. ఆ ఘటనను చూసిన భద్రతా దళాలు వెంటనే ఆ బాలుడిని రక్షించి, అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అతడిని ఊరడించేందుకు ఓ అధికారి చాక్లెట్ ఇస్తానని చెప్పినా.. ఆ బాలుడు పట్టించుకోలేదు. తన తాత గురించే చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అధికారుల కళ్లు చెమ్మగిల్లాయి. ఆ తరువాత ఆ బాలుడిని అతడి తల్లికి అప్పగించారు. కాగా ఈ బాలుడికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వాటిపై సామాన్యులు మొదలు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

Latest Articles
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..