లైవ్‌లోకి వచ్చిన చిన్నారి.. ఏం చేసిందో తెలుసా..!

కరోనా నేపథ్యంలో ఛానళ్లలో జరిగే చర్చల్లో పాల్గొని లైవ్‌లు ఇస్తున్నారు చాలా మంది. ఈ క్రమంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు సైతం ఛానెళ్ల లైవ్‌లో భాగం అవుతున్నారు.

లైవ్‌లోకి వచ్చిన చిన్నారి.. ఏం చేసిందో తెలుసా..!
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 1:41 PM

కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉండి ఛానళ్ల చర్చల్లో పాల్గొని లైవ్‌లు ఇస్తున్నారు చాలా మంది. ఈ క్రమంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు సైతం ఛానెళ్ల లైవ్‌లో భాగం అవుతున్నారు. కాగా కుటుంబ సభ్యుల చర్యలతో ఇంటర్వ్యూ ఇచ్చే వారికి కాస్త ఇబ్బందిగా అనిపించినా.. వాటికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ , అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోను ఒకటి బయటకు రాగా.. అందులోని చిన్నారికి అందరూ ఫిదా అవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. లండన్‌ స్కూల్‌ ఆఫ్ ఎకనమిక్స్‌లో పనిచేసే డాక్టర్ క్లారే వెన్‌హమ్‌ ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కరోనాపై ఆమె మాట్లాడుతుండగా.. క్లారే కుమార్తె స్కార్‌లెట్‌ తాను వేసిన యూనికార్న్ పెయింటింగ్‌తో రూమ్‌లోకి వచ్చింది. ఆ తరువాత దీన్ని ఎక్కడ పెట్టాలంటూ తల్లిని అడగ్గా.. క్లారే ఓ సెల్ఫ్‌లో పెట్టమని చూపించింది. దానికి ఇంటర్వ్యూ చేస్తున్న ఫ్రేజర్‌ యూనికార్న్ చాలా బావుందని, దాన్ని కింద షెల్ఫ్‌లో పెట్టాలని క్లారేకి తెలిపారు. ఇక ఆ తరువాత తల్లి వద్దకు వచ్చిన స్కార్‌లెట్‌ అతడి పేరు ఏంటమ్మా అని ప్రశ్నించింది. దానికి క్లారే క్రిస్టియన్‌ ఫ్రేజర్‌ అని సమాధానం ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు ఈ తిప్పలు తప్పవంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.