AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫస్ట్‌నైట్‌ రోజున ఆశగా ఎదురుచూసిన భర్తకు మస్కా కొట్టిన భార్య.. తెల్లారి లేచేసరికి.!

రెండు నెలల తర్వాత భార్యను తన ఇంటికి తెచ్చుకున్నాడు. అదే రోజు రాత్రి ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లు చేశాడు. అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు.. మరుసటి రోజు తెల్లారి చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంట్లో భార్య కనిపించలేదు.

Viral: ఫస్ట్‌నైట్‌ రోజున ఆశగా ఎదురుచూసిన భర్తకు మస్కా కొట్టిన భార్య.. తెల్లారి లేచేసరికి.!
Viral
Ravi Kiran
|

Updated on: May 14, 2025 | 6:18 PM

Share

కిలేడీ పెళ్లికూతురు కథలు చాలానే విని ఉంటాం. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ.. అమాయకులను బురిడీ కొట్టిస్తుంది ఈ కిలేడీ. ఇలాంటి దొంగ వధువుల బారిన చాలామంది వ్యక్తులు చిక్కుకున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఈ తరహ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగి.. రెండేళ్ల తర్వాత ఫస్ట్ నైట్ రోజున ఎవ్వరికీ చెప్పకుండా.. బంగారు ఆభరణాలు, డబ్బుతో ఉదాయించింది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఉంచటిల ప్రాంతానికి చెందిన రామ్ ప్రతాప్ యాదవ్‌కు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి పెళ్లికూతురు వాళ్ల తల్లిదండ్రులు ఇంటి దగ్గరే ఉంది. ఇక అతడు మే 10న, శనివారం తన భార్యను తిరిగి ఇంటికి తెచ్చుకున్నాడు. అదే రోజు రాత్రి ఫస్ట్ నైట్‌కి కూడా ఏర్పాట్లు చేశాడు. కట్ చేస్తే.! మే 11వ తేదీ తెల్లారేసరికి తన భార్య ఇంట్లో కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. తన భార్యతో పాటు ఇంట్లోని బంగారు నగలు, అలాగే రూ. 13 వేలు కనిపించకుండాపోయాయి. దీంతో తన పెళ్లికి మధ్యవర్తిత్వం వహించిన దినేష్, శ్యాము, కుల్దీప్‌లకు ఈ విషయాన్ని తెలియజేశాడు. వారు అతడికి ఎలాంటి సహకారం అందించలేదు. దీంతో చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించాడు సదరు బాధితుడు.

ఇవి కూడా చదవండి

తనకు రెండు నెలల క్రితం మహారాజ్‌గంజ్‌లోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగిందని.. మే 10న ఆమెను తన ఇంటికి తీసుకురాగా.. అదే రోజు రాత్రి భోజనం చేసిన అనంతరం. ఏం జరిగిందో తనకు తెలియదని.. మత్తుగా నిద్రపోయానని పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో రాసుకొచ్చాడు. తెల్లారి నిద్ర లేచి చూసేసరికి తన భార్య, ఇంట్లో దాచిపెట్టిన బంగారు నగలు, రూ.13 వేలు కనిపించకుండా పోయాయని పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్