పెంపుడు కుక్క పేరు సోను.. పక్కింటి ఆంటీ పేరు కూడా అదే.. గొడవ ఏ రేంజ్‌లో జరిగిందంటే..
పేరు.. రెండు కుటుంబాలను కలపగలదు.. రెండు గ్రామాలను విడగొట్టగలదు.. అంతేందుకు యుద్ధాలకు కూడా కారణంగా మారొచ్చు. పేరులో ఏముందనుకుంటే కొంప మునిగినట్లే.. అదే పేరు..
Dog Name as Sonu: పేరు.. రెండు కుటుంబాలను కలపగలదు.. రెండు గ్రామాలను విడగొట్టగలదు.. అంతేందుకు యుద్ధాలకు కూడా కారణంగా మారగలదు. పేరులో ఏముందనుకుంటే కొంప మునిగినట్లే.. అదే పేరు గుజరాత్‌లో ఓ ప్రాణం మీదికి వచ్చింది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఒక విచిత్ర ఘటన జరిగింది. కుక్క పిల్ల పేరు మార్పు వ్యవహారం కాస్తా ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ డీటైల్స్ ఏంటో తెలుసుకుందాం..
భావ్ నగర్ జిల్లాలోని-పలిటానా పట్టణంలో ఉండే.. నీతా బెన్ ఒక కుక్క పిల్లను పెంచుకుంటోంది. ఈ కుక్క పిల్ల పేరు సోను. పొరుగింట్లో ఉండే సూరాభాయ్ భార్య- పేరు కూడా సోనీయే. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ చెలరేగింది. కుక్క పేరు మార్పునకు నీతా ససేమిరా అనడంతో.. సోను జీర్ణించుకోలేక పోయింది. కసి పెంచుకుంది.. కక్ష కట్టింది. హత్యకు ప్లాన్ చేసింది. పక్కాగా స్కెచ్ వేసింది.
తన భార్య ముద్దు పేరు సోను అని.. ఆ పేరు కుక్కకు ఎలా పెడతావాంటూ.. సోను భర్త సురాభాయ్ భర్వాద్ వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరగడంతో నీతాబెన్‌పై దాడికి దిగాడు. దీంతో నీతా ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఆరుగురు వ్యక్తులతో దాడి చేసి.. అక్కడే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని ఆమెపై పోసి నిప్పంటించాడు సోను భర్త సురభాయ్. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. సరిగ్గా ఇదే సమయంలో నీతా భర్త రావడంతో ఆమె మంటలను ఆర్పేసి- ఆస్పత్రిలో చేర్చారు.
ఇప్పుడు ఈ ఘటన ఒక చిన్న కుక్కపిల్ల పేరు మార్పు వ్యవహారం ఒక మహిళకు నిప్పు పెట్టి హతమార్చే వరకూ వెళ్లడం షాకింగా ఉందంటున్నారు స్థానిక పోలీసులు. ఈ రెండు కుటుంబాలకు గతంలో తాగు నీటి విషయంలో గొడవలున్నాయని స్థానికులు అంటున్నారు. కానీ, అవి సమసిపోయాయనీ.. ఇపుడీ కుక్కపిల్ల పేరు వ్యవహారం చేతులు దాటేలా చేసిందనీ అంటున్నారు చుట్టుపక్కల వాళ్లు. పేరు కాస్తా ప్రాణాల మీదికి తెచ్చింది.
ఇవి కూడా చదవండి: Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..
Lok Sabha: సభలో మీ ఎంపీ ఏం చేస్తున్నారో చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Honey for Skin: పట్టులాంటి చర్మం కోసం తేనెను ఉపయోగించండి.. ఎలా వాడాలో తెలుసుకోండి..