Viral Video: నూతన జంటను సర్‌ప్రైజ్ చేద్దామనుకొని బొక్కబోర్లా పడ్డాడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..
Wedding Viral Video: సోషల్ మీడియోలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. అయితే.. ఈ రోజుల్లో పెళ్లిళ్ల సీజన్

Wedding Viral Video: సోషల్ మీడియోలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. అయితే.. ఈ రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కొన్నిసార్లు వధూవరుల సరదా సన్నివేశాలు.. మరికొన్నిసార్లు వివాహంలో వ్యక్తులు చేసే సరదా సన్నివేశాలు నెట్టింట వైరల్‌గా మారుతాయి. తాజాగా ఓ పెళ్లిలో జరిగిన సరదా సన్నివేశం చూపరులను నవ్వులు పూయిస్తోంది. నూతన జంట ఎదుట.. వరుడి స్నేహితులు చేసిన సందడి.. పొట్టలు చక్కలయ్యేలా నవ్విస్తోంది. విన్యాసాలు చూపించడానికి ప్రయత్నించిన స్నేహితులు.. చివరకు నవ్వులపాలయ్యారు.
స్నేహితుడి పెళ్లి వేడుకలో స్నేహితుల సందడి ప్రతిచోట కనిపిస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే కనిపించింది. స్నేహితులంతా కలిసి పెళ్లి చేసుకోబోయే నూతన జంటను సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సర్‌ప్రైజ్ కాస్త.. బొక్కబోర్లా పడేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో స్నేహితులంతా కలిసి నూతన జంట ఎదుట డ్యాన్స్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో వధూవరుల ముందు కొంతమంది స్నేహితులు డ్యాన్స్ చేయడాన్ని మీరు చూడవచ్చు. వారిలో ఓ యువకుడు స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ స్టంట్ చేస్తున్న సమయంలో స్కిడ్ అయి కింద పడిపోతాడు. ఆ తర్వాత కూడా స్నేహితులు డ్యాన్స్ చేస్తూ కనించారు. అయితే.. ఆ సన్నివేశాన్ని చూసి వధూవరులతోపాటు.. అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా పొట్టచక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..
వైరల్ వీడియో
View this post on Instagram
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వెడ్డింగ్‌బ్రిగేడ్ అనే పేజీ షేర్ చేసింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 35 వేల మందికి పైగా లైక్ చేశారు. దీంతోపాటు నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read:
