ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మండపంలో వరుడు, వధువు చేసే అల్లరి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఇందులో వరుడు తెలియక చేసిన పనికి అతిధులు కడుపుబ్బా నవ్వుకున్నారు. అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
వైరల్ వీడియో ప్రకారం.. మండపంలో బుట్టబొమ్మలా కూర్చోన్న వధువును ఉన్నట్టుండి వరుడు తన చేతులతో అమాంతంగా పైకి ఎత్తేశాడు. అది చూసిన బంధవులు, స్నేహితులు అందరూ ఒకింత షాక్ అయ్యారు. అసలేం జరుగుతోందని విస్తుపోయి చూశారు. కానీ, అంతలోనే వరుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు.
మరోసారి వధువును అమాంతం పైకి లేపి పక్కనున్న మరో పీటపై కూర్చోబెట్టాడు. అప్పుడు గానీ అతిధులకు అసలు విషయం అర్ధం కాలేదు. అసలు ముచ్చట ఏంటంటే.! తొలుత ఆ అమ్మాయి కూర్చుంది వరుడికి కుడివైపు అట.. సంప్రదాయం ప్రకారం వధువు ఎడమ వైపు ఉండాలి. కాబట్టి ఆమెను జరపటం ఇష్టం లేక వరుడు ఇలా చేయాల్సి వచ్చిందట. మొత్తానికి ఈ సీన్ మాత్రం పెళ్లిపందిట్లో నవ్వుల పువ్వులు పూయించింది. ఈ వీడియోను ‘raju_lakhchaura’ అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిని నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. భలే పెళ్లి కొడుకు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!
నడిరోడ్డుపై యువతి హాల్‌చల్.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్ ట్రెండింగ్!
కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
View this post on Instagram