AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage Goals: అరెరే పెళ్లి కొడుక్కి ఎంత కష్టం వచ్చిందో.. నవ్వు ఆపుకోలేకపోయిన వధువు.. ఫన్నీ వీడియో మీకోసం..

అసలే పెళ్లిళ్ల సీజన్.. దేశ వ్యాప్తంగా అనేక మతాల వారు, అనేక జాతుల వారు, అనేక తెగలవారు తమ తమ ఆచార సంప్రదాయాల ప్రకారం వివాహాలు చేసుకుంటారు. అయితే, ఆచారాలు, సంప్రదాయాలు ఏవైనా.. ప్రతి జంట తమ పెళ్లిని చాలా ప్రత్యేకంగా, జీవితాంతం గుర్తిండేలా చేసుకోవాలని భావిస్తారు.

Marriage Goals: అరెరే పెళ్లి కొడుక్కి ఎంత కష్టం వచ్చిందో.. నవ్వు ఆపుకోలేకపోయిన వధువు.. ఫన్నీ వీడియో మీకోసం..
Newly Wed Couple
Shiva Prajapati
|

Updated on: Apr 01, 2023 | 6:36 AM

Share

అసలే పెళ్లిళ్ల సీజన్.. దేశ వ్యాప్తంగా అనేక మతాల వారు, అనేక జాతుల వారు, అనేక తెగలవారు తమ తమ ఆచార సంప్రదాయాల ప్రకారం వివాహాలు చేసుకుంటారు. అయితే, ఆచారాలు, సంప్రదాయాలు ఏవైనా.. ప్రతి జంట తమ పెళ్లిని చాలా ప్రత్యేకంగా, జీవితాంతం గుర్తిండేలా చేసుకోవాలని భావిస్తారు. ఆ దిశగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. బరాత్, సంగీత్, మెహందీ, హల్దీ ఫంక్షన్, పెళ్లి వేదిక వద్దకు వధువు, వరుడి ఎంట్రీ సహా ప్రతీ ఘట్టాన్ని వీడియోలో చిత్రీకరిస్తూ, అందులోని ఆసక్తికర సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు కొత్త దంపతులు.

అయితే, తాజాగా ఓ జంట వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు పూజారులు చెప్పినట్లుగా కాకుండా, ఫోటో గ్రాఫర్లు చెప్పినట్లుగా జరుగుతున్నాయనే ఒక టాక్ ఉంది. ఈ వీడియో చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ జంట రిసెప్షన్ వేడుక జరుగుతోంది. అయితే, వేదికపై అందరూ చూస్తుండగానే వరుడు, వధువుకి ప్రపోజ్ చేయాలి. మోకాలి కూర్చని, పూల బొకేని ఇస్తూ ఆమెకు ప్రపోజ్ చేయాలి. అయితే, అదే ఆ పెళ్లి కొడుక్కి పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టింది. అతనికి కూర్చోరావట్లేదు, లేవరావట్లేదు. అందులోనూ అందరి ముందు ప్రపోజ్ చేసేందుకు అబ్బాయి చాలా మొహమాటపడ్డాడు. చివరకు ఫోటోగ్రాఫర్ వచ్చి.. అలా కాదు సారూ.. ఇలా ప్రపోజ్ చేయండి అంటూ కాస్త ట్రైనింగ్ ఇచ్చాడు. పెళ్లి కొడుకు ప్రయత్నాలను చూసి ఆ పెళ్లి కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. చేతిని అడ్డుపెట్టుకుని ముసి ముసి నవ్వులు నవ్వింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. జనాలు ఆ వీడియోను చూసి అరెరె పెళ్లి కొడుక్కి పెద్ద కష్టమే వచ్చిందిగా అంటూ పంచ్‌లు వేస్తున్నారు. పెళ్లి కొడుకు పడిన తిప్పలు చూసి నవ్వుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. వీడియోను మీరూ చూసేయండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

View this post on Instagram

A post shared by Ankit Kumar (@a_k_fouji10)

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..