Girls Google Search Tendency: పెళ్లికి ముందు అమ్మాయిలు.. గూగుల్లో ఇలాంటి వాటి కోసం సెర్చ్ చేస్తారా?

యువతీ యువకుల కంటే యువతే పెళ్లి పట్ల ఉత్సాహం చూపుతున్నారు. ఈ హడావుడిలో యువతులు గూగుల్ లో వింత విషయాల కోసం వెతుకుతుంటారు. పెళ్లికి ముందు యువతులు గూగుల్‌లో బట్టల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. ఇంకా ఇలాంటి విషయాలపై కూడా అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్నారట.

Girls Google Search Tendency: పెళ్లికి ముందు అమ్మాయిలు..  గూగుల్లో ఇలాంటి వాటి కోసం సెర్చ్ చేస్తారా?
Girls Google Search Tendenc
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 07, 2023 | 7:40 AM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత ప్రధానమైన ఘట్టం. పెళ్లి తర్వాత ప్రతి వ్యక్తి జీవితంలోనూ మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఇది ముఖ్యంగా మహిళలు, యువతుల జీవితాన్ని కూడా మారుస్తుంది. పెళ్లి విషయంలో యువతుల మదిలో రకరకాల భయాలు ఉండటం సహజం. ఈ సందర్భంలో ఎక్కువ మంది యువతులు గూగుల్‌లో వింత విషయాల కోసం వెతుకుతారు. యువకుల కంటే యువతే పెళ్లి పట్ల ఉత్సాహంగా ఉంటారు. పెళ్లి ప్రస్థావనతో యువతులు గూగుల్ లో వింత విషయాల కోసం వెతుకుతుంటారని పలు నివేదికలు చెబుతున్నాయి. పెళ్లికి ముందు యువతులు గూగుల్‌లో బట్టల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. వివాహం తర్వాత వారి దుస్తులు ఎలా ఉండాలో కూడా తెలుసుకుంటున్నారట. అందుకే పెళ్లి తర్వాత అమ్మాయిల దుస్తుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇంకా మరెన్నో సందేహాలను వారు గూగుల్‌లో సెర్చ్‌ చేసి నిర్ధారించుకుంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వివాహానికి అనువైన వయస్సు ఏది?

అమ్మాయిలు తమ పెళ్లి గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇదీ కాకుండా వారి మనస్సులో వేరే రకమైన భయం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు ఏంటని గూగుల్‌ని అడుగుతున్నారు. హడావుడిగా పెళ్లి చేసుకుంటూ తప్పు చేస్తున్నామా అనే ఆందోళన కూడా వారిలో కనిపిస్తుంది. ఇందుకు కారణం. ఆడపిల్లల మనసుల్లో ఎప్పుడూ పెళ్లి పట్ల తెలియని భయం వెంటాడుతూనే ఉంటుంది.

భర్తను సంతోషంగా ఉంచడం ఎలా?

అమ్మాయిలకు పెళ్లికి తర్వాత అత్తారింటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. దాంతో అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది. అత్తింటి వారితో ఎలా మసలుకోవాలి..? అక్కడ ఏం జరుగుతుందోనని అమ్మాయిలు తరచూ ఆందోళన చెందుతుంటారు. కాబట్టి, కొత్త ఇంట్లో, కొత్త వారి మధ్యలో ఎలా స్థిరపడాలి..? పెళ్లి తర్వాత తన భర్తను ఎలా సంతోషంగా ఉంచాలి..? అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు అమ్మాయిలు.. ఇంకా, అమ్మాయిలు తమ అత్తగారి గురించి కూడా గూగుల్‌ని పలు రకాల ప్రశ్నలు అడుగుతారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..