Mom Drive E-Rickshaw: ఒడిలో చంటిబిడ్డతో ఆటో నడుపుతోన్న మహిళా ఆటో డ్రైవర్.. వీడియో వైరల్‌..

తల్లి ప్రేమకు సంబంధించిన ఈ హృదయ విధారక దృశ్యాన్ని చూసిన కొందరు స్థానికులు కెమెరాలో బంధించారు. ఇదే వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ క్లిప్‌ని సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తున్నారు.

Mom Drive E-Rickshaw: ఒడిలో చంటిబిడ్డతో ఆటో నడుపుతోన్న మహిళా ఆటో డ్రైవర్.. వీడియో వైరల్‌..
Mom Drive E Rickshaw
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 07, 2023 | 8:28 AM

తల్లి ప్రేమకు ఎవరూ సాటిరారు. బిడ్డ కోసం తల్లి సింహంతో కూడా పోరాడుతుంది. ఆమె తన ఆకలిని చంపుకుంటుంది. కానీ, తన బిడ్డను ఖాళీ కడుపుతో నిద్రపోనివ్వదు. అందుకే అంటారు.. తల్లి తన పిల్లలకు ఎండలో నీడలాంటిది. వానలో గొడుగులాంటిదని.. అందుకు నిదర్శనంగా నిలిచే మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది ఆ తల్లి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. ఈ తల్లి తన బిడ్డను చూసుకుంటూ బతుకుదెరువు కోసం ఈ-రిక్షా నడుపుతుండగా ఎవరో వీడియో తీశారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కేవలం 17 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఓ మహిళ ఒక చేత్తో ఈ-రిక్షా హ్యాండిల్‌ను పట్టుకుని మరో చేత్తో పసిబిడ్డను ఎత్తుకుని ఉండటం మనం చూడొచ్చు. ఆ తల్లి చంటిబిడ్డను ఒడిలో పెట్టుకుని పొట్టకూటి కోసం జీవన పోరాటం చేస్తుంది. ఉపాధి కోసం రిక్షా తొక్కుకుంటున్న ఆ తల్లి ఒడిలో పసికందు హాయిగా నిద్రపోతున్నాడు. ప్రయాణీకులు రిక్షాలో కూర్చోగానే ఆమె ఒక చేత్తోనే ఈ-రిక్షా నడపడం ప్రారంభిస్తుంది. తల్లి ప్రేమకు సంబంధించిన ఈ హృదయ విధారక దృశ్యాన్ని చూసిన కొందరు స్థానికులు కెమెరాలో బంధించారు. ఇదే వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ క్లిప్‌ని సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ చిత్రాన్ని ‘ఖామోష్ కలాం’ (@khamosh_kalam) అనే హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, వీడియో చూసిన తర్వాత అందరి కళ్లూ చెమ్మగిల్లాయంటున్నారు. జులై 5న ఈ వీడియోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్, 5 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అదే సమయంలో వందలాది మంది వినియోగదారులు దీనిపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ తల్లికి వందనం అంటూ ఒకరు ట్విట్ చేయగా… వినియోగదారులందరూ అమ్మను అభినందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..