Dogs: వీధి కుక్కలకు రాజభోగం..! వీధి శునకాల పేర 90 కోట్ల ఆస్తులు..
సాధారణంగా బ్రతుకు దుర్భరంగా అనిపించినప్పుడు కుక్క బతుకుతో పోల్చుతుంటారు. కానీ ఇప్పడు అవికూడా మహారాజులా దర్జాగా బ్రతుకుతున్నాయి. అలాగని అవి ఏ పెంపుడు కుక్కలో అనుకునేరు. కానే కాదు. అక్షరాలా వీధి కుక్కలే. అవును వీధి కుక్కలు ఇప్పడు కోట్లకు పడగలెత్తాయి.
గుజరాత్‌లోని పంచోత్ గ్రామానికి చెందిన కుక్కలు కోట్లకు అధిపతులు. వాటి పేర ఏకంగా 90 కోట్ల ఆస్తులున్నాయి. వాటి నిర్వహణకు ఓ ట్రస్ట్ కూడా ఉంది. దాంతో ఈ వీధి శునకాల జీవితమే మారిపోయింది. పెంపుడు కుక్కలు కూడా అసూయ పడేస్థాయిలో అవి రాజభోగాలు అనుభవిస్తున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఇంతకీ ఆ కుక్కలకి అంత ఆస్తి ఎలా వచ్చిందనేగా మీ అనుమానం.. జంతువులకు సేవ చేస్తే తమకు మంచి జరుగుతుందని మెహసానా జిల్లాలోని పంచోత్ గ్రామ ప్రజలు బలంగా నమ్ముతారు. దీంతో, నిత్యం కళ్లెదురుగా తిరిగే వీధి కుక్కలకే సేవచేయాలని వారు నిర్ణయించుకున్నారు. వాటి కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి భారీ మొత్తాలను విరాళంగా ఇవ్వడం మొదలెట్టారు. కొందరు ఏకంగా కోట్ల రూపాయల విలువైన తమ ఆస్తులనే ఆ ట్రస్టుకు ధారాదత్తం చేసేశారు. ఈ శునకాలకు ఆహారం తయారు చేసేందుకు కొందరు మహిళలను నియమించుకున్నారు. వారు రోజుకు వెయ్యి రొట్టెలు చేస్తారు. వీటిని వాలంటీర్లు శునకాలకు ఇస్తుంటారు. శునకాలు అనారోగ్యం పాలైతే వెంటనే వైద్యం అందించేందుకు ఓ పశు వైద్యుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇదండీ ఇ శునకరాజాల రాజభోగం వెనుక ఉన్న అసలు కథ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

