Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: మెట్రో రైల్లో యువతి అద్భుత స్టంట్‌.. అందమైన వీడియో చూసి నెటిజన్లు ఫిదా..!

ప్పటికే ఢిల్లీ మెట్రో ఇప్పటికే అనేక రకాల వైరల్‌ వార్తలతో ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తుంది. కొందరు మెట్రోలో రోమాన్స్‌ చేస్తుంటే, మరికొందరు వింత వింత స్టంట్స్‌ చేస్తున్నారు. కొందరు బట్టలు ఆరబెట్టుకోవటం, మరికొందరు జుట్టు ఆరబెట్టుకోవటం, ఇక కొందరు మహిళలు సీటు కోసం సిగపట్లు పట్టుకున్న సంఘటనలు కూడా అనేకం చూశాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. బిగ్ బాస్ కంటే కూడా మెట్రో ఇప్పుడు మరింత వినోదాత్మకంగా మారిందంటూ

Watch Viral Video: మెట్రో రైల్లో యువతి అద్భుత స్టంట్‌.. అందమైన వీడియో చూసి నెటిజన్లు ఫిదా..!
Girl Doing Somersault
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 25, 2023 | 8:00 PM

సోషల్ మీడియా అనేది రకరకాల వీడియోలతో నిండిన ప్రపంచం అన్న విషయం తెలిసిందే. మనం తరచుగా మన కంటితో చూడలేని అనేక రకాల వీడియోలను సోషల్ మీడియాలో చూడవచ్చు. ఇప్పుడు మెట్రోలో ఓ అమ్మాయి చేసిన వింత ప్రదర్శన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మిషా శర్మ అనే అమ్మాయి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు భిన్నమైన ప్రదేశాన్ని ఎంచుకుంది. అది చూసిన నెటిజన్లు, తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు.. అవును.. మిషా ఎంచుకున్న స్టేజ్‌ మెట్రో కోచ్. ఇప్పుడు ఇదే వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మీషా శర్మ ఒక అథ్లెట్. తన ప్రతిభను వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. రద్దీగా ఉండే చిన్న మెట్రో కోచ్‌లో కొద్ది మంది ప్రయాణికులు మాత్రమే ఉన్న సమయంలో తాను ఈ స్టంట్‌ చేసింది. మెట్రోలో కొందరు కూర్చుని ఉన్నారు.. మరికొందరు వ్యక్తులు నిలబడి ఉండగా, మిషా శర్మ ఆ తక్కువ స్థలంలో తన పత్రిభను ప్రదర్శించారు. అదేంటో వీడియోలో మీరే చూడండి…

ఇవి కూడా చదవండి

మిషా శర్మ అనే అమ్మాయి మెట్రోలో ప్రయాణికులందరి మధ్యలో స్టంట్స్ చేసింది. అందరూ చూస్తుండగా అమ్మాయి ఉప్పు బస్తా స్టంట్ చేసింది.  మిషా శర్మ చేసిన ఈ పోస్ట్‌కి దాదాపు 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే అనేక లైక్‌లు, కామెంట్‌లు కూడా వచ్చాయి. దీనికి మెట్రో సరైన స్థలం కాదంటూ వీడియోపై పలు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇదిలా ఉంటే, ఇప్పటికే ఢిల్లీ మెట్రో ఇప్పటికే అనేక రకాల వైరల్‌ వార్తలతో ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తుంది. కొందరు మెట్రోలో రోమాన్స్‌ చేస్తుంటే, మరికొందరు వింత వింత స్టంట్స్‌ చేస్తున్నారు. కొందరు బట్టలు ఆరబెట్టుకోవటం, మరికొందరు జుట్టు ఆరబెట్టుకోవటం, ఇక కొందరు మహిళలు సీటు కోసం సిగపట్లు పట్టుకున్న సంఘటనలు కూడా అనేకం చూశాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. బిగ్ బాస్ కంటే కూడా మెట్రో ఇప్పుడు మరింత వినోదాత్మకంగా మారిందంటూ సోషల్ మీడియా యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా పిచ్చితో ప్రజలు ఇలాంటి వింత వింత పనులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రజా రవాణాలో ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్  చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..