Viral: చేపల కోసం వల వేసిన జాలర్లు.. గాలానికి చిక్కింది చూసి ఒక్కసారిగా కళ్లు జిగేల్!
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. సంద్రంలో జాలర్లు వల విసరగా.. అది కాస్తా బరువెక్కింది..
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. సంద్రంలో జాలర్లు వల విసరగా.. అది కాస్తా బరువెక్కింది.. అబ్బా.. ఏదో భారీ చేపే పడి ఉంటుందని జాలర్లంతా సంబరపడిపోయారు. అతి కష్టం మీద వలను లాగారు. వేటకు వెళ్లిన జాలర్ల కష్టం ఫలిచ్చింది. కాసులు కురిపించే చేప వలకు చిక్కింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో చోటు చేసుకుంది.
స్థానికంగా దక్షిణ 24 పరగణాలకు చెందిన షిబాజీ కబీర్ అనే జాలరి చేపల కోసం వేటకు వెళ్లగా.. అతడి గాలానికి 55 కిలోల బరువున్న తేలియా భోలా చేప చిక్కింది. అనంతరం దాన్ని వేలం వేయగా.. సుమారు 3 గంటల పాటు ఆ వేలం పాట కొనసాగింది. అంతేకాకుండా ఆ భారీ చేప ఏకంగా కిలో రూ. 26 వేల చొప్పున రూ. 13 లక్షలకు అమ్ముడైంది. కాగా, ఈ రకం జాతి చేపల శరీర భాగాలను క్యాప్సూల్ కవర్ల తయారీలో ఉపయోగిస్తారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఓ విదేశీ కంపెనీ భారీ మొత్తాన్ని చెల్లించి ఆ చేపను కొనుగోలు చేసిందని జాలరి వెల్లడించాడు. కాగా, తేలియా భోలా చేపలు ఏడాదికి రెండు లేదా మూడు సార్లు చిక్కుటాయట. అవి చిక్కినప్పుడు మత్స్యకారుల పంట పడినట్లే.