Viral Video: మొదటి సారి సమోసా తిన్న ఇటాలియన్ వ్యక్తి.. అతని రియాక్షన్ చూస్తే పగలబడి నవ్వుతారు..!
Viral Video: సోషల్ మీడియాలో(Social Media) ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. జంతువులకు(Animals) సంబంధించిన..
Viral Video: సోషల్ మీడియాలో(Social Media) ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. జంతువులకు(Animals) సంబంధించిన ఫన్నీ వీడియోలతో పాటు.. మనుషులు చేసే ఫన్నీ స్కిట్స్‌కి(Funny Videos) సంబంధించిన వీడియోలు, అనుకోకుండా జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ రచ్చ చేస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఎందుకు అంతలా వైరల్ అవుతుందో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు.
సాధారణంగా సమోసా అంటే చాలా మంది ఇష్టపడుతారు. టీ తాగే ముందు గానీ, స్నాక్స్‌గా కానీ సమోసాలను లాగించేస్తుంటారు జనారు. అయితే, సమోసాలు ఇష్టం లేని వారు కూడా ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. అయితే, ఓ వ్యక్తి తొలిసారి సమోసా తినేందుకు ప్రయత్నించాడు. సమోసాను మొదటిసారి తిన్న తరువాత అతని ముఖంలో లక్షణాలు చాలా ఫన్నీగా కనిపించాయి. ఇటలీకి చెందిన వ్యక్తి కొంచెం పెద్ద మనిషి మాదిరిగానే కనిపిస్తున్నాడు. అతనుు ఇప్పటి వరకు సమోసాను తినలేదట. అయితే, తొలిసారి సమోసాను తినేందుకు ప్రయత్నించాడు. అలా సమోసాను మొదటిసారి తిన్న సమయంలో అతని మొఖంలో చిత్ర విచిత్రమైన భావాలు కనిపించాయి. ఇప్పుడవే అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
అతనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. indian_italian_couple పేజీలో వీడియోను షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. కొద్ది రోజుల వ్యవధిలోనే 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను లైక్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
View this post on Instagram
Also read:
Meru Vijetha: విజయవంతంగా ముగిసిన ‘మేరు విజేత’ కాంపిటేషన్.. 2వేలకు పైగా పాల్గొన్న విద్యార్థులు..