Viral Video: హాయ్‌ ఫ్రెండ్‌ అంటూ.. డాల్ఫిన్‌ను పలకరించిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..

అంత దగ్గర డాల్ఫిన్‌ను చూస్తూ ఆ చిన్నారి ఎంతో మురిసిపోయింది. ఈ ఇద్దరి సంభాషణ చూస్తుంటే..ఈ చిన్నారి – డాల్ఫిన్‌ మధ్య చాలా కాలంగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Viral Video: హాయ్‌ ఫ్రెండ్‌ అంటూ.. డాల్ఫిన్‌ను పలకరించిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..
Friendly Dolphin
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2024 | 1:05 PM

ప్రస్తుత ఆధునిక యుగంలో ఇంటర్‌నెట్‌దే హవా. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్స్‌ వాడుతూ.. ఇంటర్‌నెట్‌ను విచ్చలవిడిగా యూజ్‌ చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై తమ టాలెంట్‌ను చూపించుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్ని కాదు.. జనాల్ని ఆక‌ట్టుకునే కంటెంట్‌, వీడియోల‌కు కొద‌వ ఉండ‌దు. రాత్రికి రాత్రి తమ వీడియాలు వైరల్ అయిపోవాలని ఒకరు ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తుంటే, మరికొందరు అవతలి వారికి ప్రమాదమని తెలిసినా పిచ్చి చేష్టలు చేస్తుంటారు. అలాంటివే ఎన్నో స్ఫూర్తిదాయక, నవ్వు తెప్పించే వీడియోలు, ఆలోచ‌న రేకెత్తించే పోస్టులు కూడా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తుండ‌గా మ‌రికొన్ని వీడియోలు ప్రేమ‌తో నెటిజన్ల హృద‌యాన్ని హ‌త్తుకుంటాయి. అలాంటి వీడియో ప్రస్తుతం ఒకటి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది.

వైరల్‌ వీడియోలో ఒక చిన్నారి, అందమైన డాల్ఫిన్‌ మధ్య స్నేహపూర్వక సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్వేరియంలోని డాల్ఫిన్‌ను చూసిన చిన్నారి ఎంతో ఉత్సాహంగా ఎగురుతూ దానికి హాయ్‌ చెబుతోంది. అది చూసిన డాల్ఫిన్‌ వెంటనే అక్కడ ఆగి చిన్నారిని పలకరిస్తున్నట్లుగా నోరు తెరిచింది. తన తోకపై నీటిలో నిల్చొని పాపతో ఏదో చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ చిన్నారి వెంటనే దానికి మరింత దగ్గరగా వెళ్లింది.. అంత దగ్గర డాల్ఫిన్‌ను చూస్తూ ఆ చిన్నారి ఎంతో మురిసిపోయింది. ఈ ఇద్దరి సంభాషణ చూస్తుంటే..ఈ చిన్నారి – డాల్ఫిన్‌ మధ్య చాలా కాలంగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

వాస్తవానికి ఇది పాత వీడియోనే అయినా, ట్రెండింగ్‌ అమెరికన్‌ రీపోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా వీడియోను ఎక్కువగా లైక్ చేస్తున్నారు. మళ్లీ మళ్లీ చూస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..