Viral Video: స్నేహమంటే ఇదేరా.. పెద్ద ప్రమాదం నుంచి మిత్రుడిని సేవ్ చేశాడు.. కట్ చేస్తే..
వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితంలో మనమే స్నేహితులను ఎంచుకుంటాము. స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకంటే మంచి స్నేహితులు జీవితంలో..
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్(Viral Video) అవుతోంది. ఈ వీడియోలలో కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటే.. మరి కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాగే, అనేక సార్లు ఆశ్చర్యపరిచే కొన్ని వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు స్నేహితుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితంలో మనమే స్నేహితులను ఎంచుకుంటాము. స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకంటే మంచి స్నేహితులు జీవితంలో చాలా సమస్యలను పరిష్కరిస్తారు. మరోవైపు, స్నేహితులు బాగా లేకుంటే అనేక సమస్యల సుడిగుండం మనను అందులోకి లాగేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇద్దరు స్నేహితులకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి, ఇద్దరు స్నేహితులు రోడ్డు పక్కన నడుస్తున్నట్లు కనిపించే వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో రోడ్డుకు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే.. ఎదురుగా తెల్లటి రంగు కారు వేగంగా వచ్చింది. ఈ సమయంలో డ్రైవర్ చూడకుండా రోడ్డు వైపుగా ఉన్న బాలుడికి సమీపంగా వస్తుంది. అయితే బాలుడు కారును చూడలేడు మరియు కారు డ్రైవర్ అబ్బాయిని చూడలేడు. పెద్ద ప్రమాదం నుంచి అతని పక్కన ఉన్న మిత్రుడు రక్షిస్తాడు.
స్నేహితుల వీడియో చూడండి..
View this post on Instagram
అయితే, కారు తన మిత్రుడిని ఢీకొనకుండా బాలుడిని రక్షించాడు. నల్ల టీ షర్టు ధరించిన బాలుడు తన స్నేహితుడిని అతని వైపుకు లాగి అతనిని రక్షిస్తాడు. తన స్నేహితుడిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతాడు. బాలుడు ఇంత చురుకుదనం ప్రదర్శించకుంటే బహుశా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన యూజర్లు షేర్ చేయడమే కాదు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.