Video: తొలిసారి బతికున్న ఆక్టోపస్‌ను తిన్న కుర్రాడు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ఒక కొరియన్ యువకుడు తన మొదటి లైవ్ ఆక్టోపస్ (సన్నక్జీ) అనుభవాన్ని వీడియోలో పంచుకున్నాడు. నువ్వుల నూనెలో ముంచి తిన్నాడు. తన అనుభవం "క్రేజీ" అని, కానీ ఊహించిన దానికంటే బాగుందని అతడు పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలియని ఆహార పదార్థాలు తినడం ఎవరికైనా ఇబ్బందే. మరీ ముఖ్యంగా గతంలో అసలు అలవాటు లేని నాన్ వెజ్ తినడం అంటే పెద్ద సహసమనే చెప్పాలి. అలాంటి సాహాసాన్నే ఓ కుర్రాడు చేశాడు. తన జీవితంలో తొలిసారి ఆక్టోపస్‌ను తిన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ కొరియన్ కుర్రాడు ఇటీవల కొరియాలో సన్నక్జీ అని పిలువబడే లైవ్ ఆక్టోపస్ వంటకం తినే సాహసోపేతమైన సవాలును స్వీకరించాడు. నువ్వుల నూనెతో తాజాగా వడ్డించినప్పుడు, టేబుల్‌పైకి తీసుకువచ్చినప్పుడు టెంటకిల్స్ కదులుతూనే ఉంటాయి. ఈ వీడియోను @40kahani అనే Instagram పేజీలో పోస్ట్ అయింది.
మీరెప్పుడైనా లైవ్ ఆక్టోపస్ తిన్నారా? ఇది లైవ్ ఆక్టోపస్, ఇదిగో ఇది డ్యాన్స్ చేస్తుంది. ఓహ్ మై గాడ్. దీన్ని ఎలా తింటాం? తినడానికి ముందు నువ్వుల నూనెలో ముంచాలి అంటూ ఆ వీడియోలో కుర్రాడు చెప్పడం గమనించవచ్చు. ‘మొదటిసారి లైవ్ ఆక్టోపస్ తినడం.. క్రేజీ అనుభవం! కానీ నేను ఊహించిన దానికంటే బాగుంది’ అంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చాడా కుర్రాడు. ఆ కుర్రాడు తొలి సారి లైవ్ ఆక్టోపస్ తింటున్న అనుభవానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
