ఫేమస్‌ రెస్టారెంట్‌లో మంటలు.. భవనం పై నుంచి దూకిన ప్రజలు.. షాకింగ్‌ వీడియో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 10కి పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఫేమస్‌ రెస్టారెంట్‌లో మంటలు.. భవనం పై నుంచి దూకిన ప్రజలు.. షాకింగ్‌ వీడియో వైరల్
Fire Accident In Delhi
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2024 | 11:55 AM

ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో గల ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడ నుండి దూకడం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 10కి పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

హుటాహుటిన మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. రాజౌరీ గార్డెన్‌ మెట్రో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న జంగిల్‌ జంబోరీ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. నివేదికల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం ఒక రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..