AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పులిని పరుగులు పెట్టించిన ఎలుగుబంటి.. యుద్ధం మాములుగా లేదుగా.. షాకింగ్ వీడియో మీకోసమే!

ఎంతటి బలశాలి అయినా కూడా ఏదొక సందర్భంలో ఓటమిని చవి చూడాల్సిందే. ఈ సామెత మనుషులకు మాత్రమే కాదు జంతువులకు...

Viral Video: పులిని పరుగులు పెట్టించిన ఎలుగుబంటి.. యుద్ధం మాములుగా లేదుగా.. షాకింగ్ వీడియో మీకోసమే!
Bear Fight
Ravi Kiran
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 03, 2022 | 10:20 AM

Share

ఎంతటి బలశాలి అయినా కూడా ఏదొక సందర్భంలో ఓటమిని చవి చూడాల్సిందే. ఈ సామెత మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా పులులు అడవిలో పలు జంతువులను వేటాడుతుంటాయి. అలాగే భయపెడుతుంటాయి కూడా. అయితే ఎంత పులి అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో తప్పటడుగు వేయడం జరుగుతుంది. ఎదురుపడ్డ జంతువును సరిగ్గా అంచనా వేయకలేక ఓటమిని ఒప్పుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇదే పరిస్థితి ఓ పులికి ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అడవి దారిలో ఉన్న పులికి.. ఓ ఎలుగుబంటి తారసపడుతుంది. ఇక దాన్ని చూసిన వెంటనే ఒక్క ఉదుటన పులి వేటకు దిగుతుంది. ఎలుగుబంటిపై దాడి చేయడమే కాకుండా.. దాన్ని పదునైన దవడలతో పట్టుకుంటుంది పులి. కానీ ఇక్కడ ఎలుగుబంటి కూడా తక్కువేం కాదు.. తన కాళ్లకు ఉన్న పదునైన గోళ్లతో పులిపై విరుచుకుపడుతుంది. దీనితో ఏం చేయాలో దిక్కుతోచని పులి.. ఒక్కసారిగా వెనుకంజ వేస్తుంది. అంతే.! ఎలుగుబంటి మరింత ధైర్యాన్ని కూడగట్టుకుని తన పోరాటాన్ని కొనసాగిస్తూ పులిని పరుగులు పెట్టిస్తుంది. మరోసారి దాడి చేసేందుకు పులికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఎలుగుబంటి తరిమితరిమి కొడుతుంది. చివరికి ఓ కొలను దగ్గరకు చేరుకున్న పులి బ్రతుకు జీవుడా.. అనుకుంటూ నీటిలో సేద తీరుతుంది.

కాగా, ఈ వీడియోను ‘BoskyKhanna’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియో చూసేయ్యండి.