Viral Video: ఉబర్‌ను నడుపుతున్న గూగుల్ మాజీ ఉద్యోగి.. నెట్టింట్లో వీడియో వైరల్
గూగుల్‌లో చేరిన ఉద్యోగులు వేరే సంస్థల్లో ఉద్యోగానికి మారాలంటే ఆ కంపెనీ నుంచి హైక్ దాదాపు 50-100% ఉంటే తప్ప వేరే కంపెనీలకు వెళ్లాలని అనుకోరు. అయితే ఇలాంటి గూగుల్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి బైక్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారంటే.. ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి ఒక ఉద్యోగి గురించి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అసలు విషయం ఏంటంటే.. గూగుల్ మాజీ ఉద్యోగి ఒకరు ఉబర్ బైక్ నడుపుతూ బెంగళూరులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి గూగుల్ కంపెనీ. ఈ కంపెనీలో ఉద్యోగం చేయాలనీ ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తి కలలు కంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడి పనిచేసే ఉద్యోగులు భారీ జీతం పొందడమే కాదు.. ఏ ఇతర కంపెనీల్లో అందుబాటులో లేని అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. అందుకనే ఎక్కువమంది ఈ కంపెనీలో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తారు. గూగుల్‌లో చేరిన ఉద్యోగులు వేరే సంస్థల్లో ఉద్యోగానికి మారాలంటే ఆ కంపెనీ నుంచి హైక్ దాదాపు 50-100% ఉంటే తప్ప వేరే కంపెనీలకు వెళ్లాలని అనుకోరు. అయితే ఇలాంటి గూగుల్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి బైక్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారంటే.. ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి ఒక ఉద్యోగి గురించి ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అసలు విషయం ఏంటంటే.. గూగుల్ మాజీ ఉద్యోగి ఒకరు ఉబర్ బైక్ నడుపుతూ బెంగళూరులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఓ వ్యక్తి బైక్‌పై వెళుతుండగా, అతని వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ నడుపుతూ వీడియో తీస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు.
వీడియో చూడండి
My Uber Moto driver is ex-google, moved to Bangalore 20 days ago from Hyderabad.
He is just doing this to explore the city it seems. pic.twitter.com/C2zA71fMdJ
— Raghav Dua (@GmRaghav) October 22, 2023
రాఘవ్ దువా అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఊరి గురించి తెలుసుకోవడం కోసమే ఇలా చేస్తున్నాడని తెలుస్తోంది. కేవలం 4 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 64 వేలకు పైగా వీక్షించగా.. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ‘బెంగళూరుకు వచ్చిన వాళ్లంతా డ్రైవర్లు ఎందుకు అవుతారు?’ అని ఒక యూజర్ రాస్తే, ‘అతను బహుశా గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాకపోవచ్చు’ అని మరొకరు రాశారు. అదేవిధంగా.. అతని కథను వివరిస్తూ మరొకరు ‘తాను విశాఖపట్నం నుండి 53 ఏళ్ల మాజీ బ్యాంక్ మేనేజర్‌ని కలిశానని.. ఇప్పుడు ఢిల్లీలో నివసిస్తున్నానని రాపిడో నడపడం ద్వారా ప్రజలతో పరస్పర చర్యను పెంచడానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నాడు. నగరం గురించి తెలుసుకోవడానికి కూడా ఇలా చేస్తున్నానని వెల్లడించాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..