Viral Video: యూపీ సర్కార్ పరువు తీసిన పోలీస్.. మా మెస్ లో పెట్టే తిండి జంతువులు తినవంటూ..

పోలీసు అధికారులకు పౌష్టికాహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భృతిని అందజేస్తుందని ముఖ్యమంత్రి యోగి గతంలోనే ప్రకటించారని..  అయితే ఎక్కువ గంటలు డ్యూటీ చేసిన తర్వాత మనకు లభించే ఆహారం ఇదే అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్.

Viral Video: యూపీ సర్కార్ పరువు తీసిన పోలీస్.. మా మెస్ లో పెట్టే తిండి జంతువులు తినవంటూ..
Up Cop Viral Video
Follow us

|

Updated on: Aug 11, 2022 | 12:22 PM

Viral Video: మనిషి ఎంత కష్టడినా కడుపునిండా తిని.. కంటి నిండా నిద్రపోవడం కోసమే.. అయితే సమాజ భద్రత కోసం సరైన తిండి, నిద్ర లేకుండా అహర్నిశలు శ్రమించేవారు రక్షక భటులు.. అటువంటి ఓ పోలీసు తాము సరైన తిండి తినకపోతే.. ఎలా విధులు నిర్వర్తిస్తాం అంటూ ప్రశ్నిస్తున్నాడు.. అంతేకాదు తమకు మెస్ లో పెట్టె ఆహారం కనీసం జంతువులు కూడా తినవు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..

యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో బుధవారం ఒక పోలీసు కానిస్టేబుల్ పోలీసుల మెస్‌లో వడ్డించే ఆహారం నాణ్యతపై తన గళం వినిపించాడు. నడి  రోడ్డుపై నిలబడి బోరున విలపిస్తూ ఇది తమ పరిస్థితి అని ప్రజలకు తెలియజేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో..  కానిస్టేబుల్ మనోజ్ కుమార్ రోటీలు, పప్పు, అన్నం ప్లేట్‌తో రోడ్డుపై ఏడుస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఒక సీనియర్ అధికారి ఆ పోలీసుని రోడ్డు మీద నుంచి తిరిగి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అంతేకాదు అతడిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

ఇవి కూడా చదవండి

రోడ్డుమీద ఉన్న బాటసారులకు ప్లేట్ లోని ఆహారాన్ని చూపిస్తూ.. పోలీసు మనోజ్ కుమార్ తమకు పెట్టే ఆహారం గురించి తన సీనియర్లకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు తనను ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని చెప్పాడు మనోజ్. పోలీసు అధికారులకు పౌష్టికాహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భృతిని అందజేస్తుందని ముఖ్యమంత్రి యోగి గతంలోనే ప్రకటించారని..  అయితే ఎక్కువ గంటలు డ్యూటీ చేసిన తర్వాత మనకు లభించే ఆహారం ఇదే అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. “మాకు సరైన ఆహారం పెట్టక పొతే.. పోలీసులు ఎలా పని చేస్తారు?” అని అతను పై అధికారులను ప్రశ్నించాడు. మరొక వీడియోలో.. మనోజ్ తాను తినే ఆహారం ప్లేట్‌తో డివైడర్‌పై కూర్చుని, “జంతువులు కూడా దీనిని తినవు” అని చెప్పడం కనిపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు