Viral: శాలరీ డబ్బు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన వ్యక్తి.. బ్యాలెన్స్ చెక్ చేయగా షాక్.. కట్ చేస్తే!
అతనొక చిరు ఉద్యోగి.. నెలనెలా తనకొచ్చే జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తాజాగా తనకొచ్చిన జీతం డబ్బులు...
అతనొక చిరు ఉద్యోగి.. నెలనెలా తనకొచ్చే జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తాజాగా తనకొచ్చిన జీతం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అనంతరం బ్యాలెన్స్ చెక్ చేయగా.. స్క్రీన్‌పై దర్శనమిచ్చిన అమౌంట్ చూసి కళ్లు తేలేశాడు.. ఇంతవరకు ఒక ఎత్తయితే.. దీని తర్వాత జరిగిన స్టోరీ మరో ఎత్తు. అదేంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.. చిలీ(Chili) దేశంలోని కన్సార్సియో ఇండిస్ట్రియల్ డే అలిమెంటోస్ అనే ప్రముఖ మైనింగ్ సంస్థలో ఓ ఉద్యోగి రూ. 43 వేల జీతానికి పని చేస్తున్నాడు. అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ సమస్య వల్ల అతడి ఖాతాలోకి రూ. 43 వేలు జీతం డబ్బులు పడాల్సిందిపోయి.. ఏకంగా 286 రెట్లు ఎక్కువగా.. అంటే సుమారు రూ. 1.42 కోట్లు జమ అయ్యాయి. తన అకౌంట్‌లో అంత డబ్బును చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు సదరు వ్యక్తి. సీన్ కట్ చేస్తే..
సదరు వ్యక్తికి అంత డబ్బు చూశాక.. ఓ ప్లాన్ తట్టింది. ఆ డబ్బు మొత్తాన్ని విత్‌డ్రా చేశాడు. ఆఫీస్‌కు తన రాజీనామా లేఖను పంపించాడు.. కట్ చేస్తే.. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోయాడు. అటు అకౌంట్స్ సిబ్బంది జరిగిన తప్పిదాన్ని గుర్తించి.. సదరు ఉద్యోగిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే ఈలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ సంఘటన మే 30వ తేదీన జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఆ డబ్బుతో ఉద్యోగి ఉడాయించడంతో.. కంపెనీ అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. చూడాలి మరి.. చివరికి ఆ సొమ్ము కంపెనీ దక్కించుకుంటుందో.? లేదో.?