Viral: పురాతన ఆలయంలో తవ్వకాలు జరుగుతుండగా బయటపడ్డ అద్భుతం.. శాస్త్రవేత్తలు పరిశోధించగా మైండ్ బ్లాంక్!

భూమి లోపల అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సమాధానాలు లేని...

Viral: పురాతన ఆలయంలో తవ్వకాలు జరుగుతుండగా బయటపడ్డ అద్భుతం.. శాస్త్రవేత్తలు పరిశోధించగా మైండ్ బ్లాంక్!
Temple
Follow us

|

Updated on: Jun 30, 2022 | 12:30 PM

భూమి లోపల అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సమాధానాలు లేని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. ఆ కోవకు చెందిన ఓ పురాతన దేవాలయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ కథేంటంటే..?

వివరాల్లోకి వెళ్తే.. సౌత్ అమెరికాలోని పెరు(Peru) దేశంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఉత్తర-మధ్య ఆండీస్‌ ప్రాంతంలో ఉన్న ‘చవిన్ డి హుయంటార్'(Chavin de Huantar) అనే 3 వేల ఏళ్ల నాటి పురాతన దేవాలయంలో కొన్ని సంవత్సరాల నుంచి తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాఖ అధికారులకు 35 రహస్య సొరంగాలు(గుహాలు) బయటపడ్డాయి. అవన్నీ కూడా క్రీస్తుపూర్వానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉండగా.. చాలా ఏళ్ల పాటు తవ్వకాలు జరిపిన అనంతరం ఈ ఏడాది మే నెలలో 35 సొరంగాలను పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. క్రీస్తుపూర్వం 200-1200 మధ్య అండీస్ పర్వత ప్రాంతంలో ఇంటర్‌కనెక్టడ్ సొరంగాలు నిర్మించబడ్డాయి. ఈ సొరంగాలు పూర్తిగా భిన్నమైనవని, ఇవి కూడా విభిన్నంగా నిర్మించబడ్డాయని పురావస్తు శాఖ అధికారి రిక్ వెల్లడించాడు.

Mysterious Cave

ఇవి కూడా చదవండి

చరిత్ర ఏం చెబుతోంది…

ఈ ఆలయం(Chavin de Huantar) 1985వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. 1997వ సంవత్సరంలో పెరువియన్ సాయుధ దళాలు బందీలుగా ఉన్న 72 మందిని రక్షించేందుకు సైనిక ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో తుపాక్ అమరు రెవల్యూషనరీ మూవ్‌మెంట్ తిరుగుబాటు బృందంపై యుద్దానికి సిద్దమయ్యారు. అప్పుడే సైనికులు పలు సొరంగాలు నిర్మించారు. వాటిల్లో ఇవి కూడా ఒక భాగం అయి ఉంటాయని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.