Viral Video: బంతాట ఆడుతోన్న గజరాజు.. ఏనుగు ఫన్నీ గేమ్‌కు నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో.!
సాధారణంగా ఏనుగు చేసే చేష్టలకు కొన్ని సార్లు నవ్వులు తెప్పిస్తాయి. ఏనుగు శాఖాహారి. నేరుగా ఏదైనా పండ్లు, ఫలాలు తినిపించిన ఎంతో నిదానంగా తింటుంటాయి.
సాధారణంగా ఏనుగు చేసే చేష్టలకు కొన్ని సార్లు నవ్వులు తెప్పిస్తాయి. ఏనుగు శాఖాహారి. నేరుగా ఏదైనా పండ్లు, ఫలాలు తినిపించిన ఎంతో నిదానంగా తింటుంటాయి. ఏనుగు దగ్గరకు వెళ్లాలంటే భయం వేసిన.. మావటివారు దాని పక్కన ఉంటే.. భయం లేకుండా నేరుగా ఏనుగు దగ్గరకు వెళ్లి మరీ తినిపిస్తుంటాం. అయితే ఇటీవల ఏనుగులకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తుంటాయి. ఏనుగులు ఆటలాడే వీడియోలు కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇటీవల గువహతిలోని ఆర్మీ క్యాంపులో హెల్మెట్ తిన్న ఏనుగు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గువహతిలోని నారంగి సమీపంలో ఉన్న సాట్గావ్ ఆర్మీ క్యాంపులోకి ఓ ఏనుగు ప్రవేశించి బాస్కెట్ బాల్ ఆడుతోంది. అక్కడే ఉన్న యువకులు బాస్కెట్ బాల్ ఆడుతున్న సమయంలో ఏనుగు ఆకస్మాత్తుగా ప్రవేశించింది. దారిపై పడిన బంతిని తన తొండతో పట్టుకొని వెళ్లింది. దీంతో బాల్ తమకు ఇవ్వాలని అక్కడి యువకులు గట్టిగా అరిచిన.. ఏనుగు మాత్రం అవేం పట్టనట్లుగా బంతి పట్టుకొని చక్కా పోయింది. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతోంది. ఏనుగు బంతాట చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యపోతున్నారు.
ట్వీట్..
অই বল দে, অই বল দে (Give the ball, give ball)…..but this wild elephant was busy in playing with the ball.#Assam #Guwahati pic.twitter.com/HPdnSsbTrj
— Hemanta Kumar Nath (@hemantakrnath) June 14, 2021
Also Read: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ సర్వీసులకు అంతరాయం.. నెట్ బ్యాంకింగ్ వాడాలని సూచించిన హెచ్డీఎఫ్సీ..
దేశంలో ప్రస్తుతానికి అదుపులోనే కరోనా వైరస్ ట్రాన్స్ మిషన్……అయినా అప్రమత్తత అవసరమంటున్న కేంద్రం