AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..

జంతువులకు సంబందించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. జంతువులు సౌమ్యంగా ఉన్నంతవరకు ఓకే కానీ వాటికి కోపం వస్తే మాత్రం భీకరం సృష్టిస్తాయి. కొండంత ఏనుగు కూడా మావటి వాడి మాట వింటుంది. అదే తేడా వస్తా తొక్కి చంపేస్తుంది, ఏనుగులు దాడికి సంబందించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

Viral Video: నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
Elephant
Rajeev Rayala
|

Updated on: May 10, 2024 | 11:51 AM

Share

జంతువులతో పెట్టుకుంటే అమలుగా ఉండదు.. అది చిన్నదైనా.. పెద్దదైనా దాని ఏరియాలోకి వెళ్లి మనం ఫోజులు కొడితే ఊరుకుంటుందా..? ఎత్తి కుదేస్తోంది. ఎస్.. ఇక్కడ కూడా అదే జరిగింది. జంతువులకు సంబందించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. జంతువులు సౌమ్యంగా ఉన్నంతవరకు ఓకే కానీ వాటికి కోపం వస్తే మాత్రం భీకరం సృష్టిస్తాయి. కొండంత ఏనుగు కూడా మావటి వాడి మాట వింటుంది. అదే తేడా వస్తా తొక్కి చంపేస్తుంది, ఏనుగులు దాడికి సంబందించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఏనుగు సంబందించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ట్రెండింగ్ వీడియోలో ఓ ఏనుగు చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.. అంతేన ప్రాణాలు తీసినంత పని చేసింది ఆ గజరాజు. ఈ వీడియోలో కొంతమంది టూరిస్ట్ లు ఓ అడవి ప్రాంతాల్లోకి వెళ్లారు. వ్యాన్ లో షికారు చేస్తూ ఉండగా ఓ భారీ ఎందుకు వారికి ఎదురు వచ్చింది. నా ఏరియాలోకే వస్తారా..? వెళ్లిపోండి అంటూ ఓ లుక్ ఇచ్చింది. అయినా ఆ వ్యాన్ లో ఉన్న వారు మాట వినకపోయేసరికి ఆ ఏనుగు తన ప్రతాపం చూపించింది.

ఆ వ్యాన్ ను వెనక్కి వెళ్ళాలి అని ఆది దాని చూపులతో ఆదేశించినా వారు వినలేదు. దాంతో ఆ ఏనుగు తన తొండంతో ఆ పెద్ద వ్యాన్ ను పైకి ఎత్తి కిందకు వదిలింది. దెబ్బకు ఆ వ్యాన్ లో ఉన్నవారు వణికిపోయారు. అంతతో ఆగలేదు మరోసారి దాని బలం చూపించింది. ఆ వ్యాన్ ను ఎత్తి పడేసే ప్రయత్నం చేసింది. దెబ్బకు ఆ వ్యాన్ లో ఉన్నవారు బ్రతకు జీవుడా అంటూ వెనక్కి వెళ్లిపోయారు. ఏనుగుకుడా తాను అనుకున్నదాని సాధించా అన్న గర్వంతో అక్కడే నిలబడిపోయింది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఎవరైతే నాకేంటి..ఇది నా ఏరియా అంటూ ఆ ఏనుగు మనసులోని మాటలను కామెంట్స్ గా రాస్తున్నారు నెటిజన్స్.

Follow Us