Viral Video: తన సహచరుడి మృతిని జీర్ణించుకోలేక మేల్కొపడానికి ఆడ ఏనుగు విఫల యత్నం.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో

ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో జంతువుల వీడియోలు ముఖ్యంగా.. ఏనుగుకి సంబంధించిన వీడియోలు ఫన్నీగా ఉండి అమితంగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు కూడా ఏనుగు వీడియో వేగంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చాలా భావోద్వేగంగా ఉంది. తన సహచరుడి మరణంతో ఏనుగు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Viral Video: తన సహచరుడి మృతిని జీర్ణించుకోలేక మేల్కొపడానికి ఆడ ఏనుగు విఫల యత్నం.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో
Elephant Video Viral

Updated on: Oct 16, 2025 | 5:26 PM

ప్రకృతి మానవులకు భావోద్వేగం, ఆప్యాయత, ప్రేమ, ప్రియమైనవారి పట్ల శ్రద్ధ వంటి అనేక లక్షణాలను ఇచ్చింది. ఇటువంటి లక్షణాలే అడవి జంతువులైన ఏనుగులో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. తమ సహచరుల నుంచి విడిపోవడం వల్ల కలిగే దుఃఖం వాటిని కూడా వేధిస్తుంది. అవి కూడా విడిపోయిన తర్వాత ఏడుస్తాయి. తమ బాధను వ్యక్తం చేస్తాయి. కొన్నిసార్లు మృతదేహం దగ్గర విలపిస్తాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ఆడ ఏనుగు.. తన సహచరుడైన ఏనుగు మరణానికి దుఃఖిస్తూ కనిపిస్తుంది. ఆ క్షణం చాలా భావోద్వేగంగా ఉంది. ఆడ ఏనుగు.. చనిపోయిన ఏనుగును మేల్కొలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. తన తొండంతో ఏనుగును ఊపుతూ.. దాని శరీరాన్ని తాకి.. దానిని మేల్కొలపడానికి విఫలయత్నం చేయడం కనిపిస్తుంది.

భావోద్వేగ దృశ్యం
ఆ వీడియోలో నేలపై పడి ఉన్న ఏనుగు శరీరం కనిపిస్తుంది. 25 సంవత్సరాలు కలిసి గడిపిన తన జీవిత భాగస్వామి తనను శాశ్వతంగా విడిచిపెట్టిందని ఆడ ఏనుగు నమ్మలేదు. ఏనుగు శరీరం దగ్గర దుఃఖిస్తూ.. అతన్ని మేల్కొలపడానికి పదే పదే ప్రయత్నిస్తోంది. ఆడ ఏనుగు తన సహచరుడిని మేల్కొలపాలని ఆశతో పదే పదే తన తొండాన్ని రుద్దుతుంది. ఎంత ప్రయత్నించినా ఏనుగు కదలేదు.

ఇవి కూడా చదవండి

 

ఈ జంట అడవిలో 25 సంవత్సరాలు కలిసి గడిపారు. 25 వసంతాలను కలిసి చూశారు. వర్షాన్ని ఆస్వాదించారు. శీతాకాలపు చలిని భరించారు ఇప్పుడు ఆడ ఏనుగు ఆకస్మికంగా ఒంటారిగా మిగిలిపోయింది. తన సహచరుడి మరణంతో బాధపడుతోంది. అతనిని వదులి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @AmazingSights అనే వినియోగదారు పేరుతో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. కొన్ని గంటల్లోనే వేలాది మంది దీనిని వీక్షించారు. చాలా మంది వినియోగదారులు తమ భావాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేశారు.

ఈ వీడియో చాలా మనసును కదిలిస్తుంది. చాలా మంది “RIP” అని వ్యాఖ్యానించగా.. మరికొందరు “విచారంగా” అని వ్యాఖ్యానించారు. ఏనుగు ఏడుపు ఎవరినైనా కన్నీళ్లు పెట్టిస్తుంది. ఏనుగులు అత్యంత భావోద్వేగ జీవులు అని ఈ వీడియో మరోసారి రుజువు చేస్తుంది. అవి కుటుంబంలా మందలుగా జీవిస్తాయి. ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహిస్తాయి. తన 25 సంవత్సరాల సహచరుడిని కోల్పోయిన ఏనుగు బాధ చూడడానికి వర్ణనాతీతంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.