Eagle vs Crab: స్థానబలమా మజాకా..! తనను తినడానికి వచ్చిన పక్షిరాజుకి ‘పీత’ గుణపాఠం.. అసలు ఏం జరిగిందంటే..?
స్థానబలం అనేది ఒకటి ఉంటుందని, ప్రతికూలమైన ప్రదేశాలలో మౌనంగా ఉండడం మేలని లేకపోతే కష్టాలు తప్పవు. ఈ జీవన సత్యాన్ని వేమన ప్రజాకవి ఏదో నోటి మాటగా చెప్పలేదు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవపూర్వకంగా నేర్చుకునే గుణపాఠమే. అయితే ఇది ప్రకృతిధర్మం కూడా..
‘అనువు గాని చోట అధికులమనరాదు..’ అంటూ సాగే వేమన పద్యం మీకు గుర్తుందా..? స్థానబలం అనేది ఒకటి ఉంటుందని, ప్రతికూలమైన ప్రదేశాలలో మౌనంగా ఉండడం మేలని లేకపోతే కష్టాలు తప్పవని దాని అర్థం. ఈ జీవన సత్యాన్ని వేమన ప్రజాకవి ఏదో నోటి మాటగా చెప్పలేదు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవపూర్వకంగా నేర్చుకునే గుణపాఠమే. అయితే ఇది ప్రకృతిధర్మం కూడా. ఇందుకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పక్షులకు రాజైన ఓ గద్ద నీటిలో తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటుంది. అంతేనా ఓ పీత(ఎండ్రకాయ)ను చూసి దాన్ని తినేయాలని ప్రయత్నించింది. అయితే గద్ద బలం గాలిలోనే కానీ నీటిలో కాదుగా.. దాని నోటిని గట్టిగా పట్టేసింది ఆ పీత(ఎండ్రకాయ). ప్రాణం కోసం పోరాటం చేయకపోతే మరణం తప్పదుగా. గద్ద బలం అక్కడ పనిచేయకపోవడంతో దానికి పీతతో పాటు నీట మునగక తప్పలేదు.
ఇవి కూడా చదవండిView this post on Instagram
అయితే దీనిని సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అలాగే వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న అభిప్రాయాలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘స్థానబలం గురించి వేమన చెప్తే ఎవరు వినలేదు. కానీ ఈ పీత చేసి చూపించింద’ని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ అయితే ‘నమ్మశక్యం కావడంలేద’ని తెలపగా.. మరోకరు ‘బైబిల్‌లోని డేవిడ్, గొలియత్ ఫైట్ ఇలాగే ఉంటుంద’ని రాసుకొచ్చాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వీడియోపై తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 51 వేలకు పైగా లైకులు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..