AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Video: అలిగిన ఫ్రెండ్‌ ముందు మిడత ‘కుంగ్‌ఫూ, కరాటే ప్రాక్టీస్’.. వైరల్ అవుతున్న వీడియో..

అలిగిన మీ ఫ్రెండ్ కోసం డ్యాన్స్ వేశారా..? ఫ్రెండ్ అలిగితే డ్యాన్స్ వేయడం ఎందుకనుకుంటున్నారా..? ఏమో మరీ.. ఓ మిడత తన ఫ్రెండ్ కోసం డ్యాన్స్ వేసింది. అవును, మిడత డ్యాన్స్ వేయడం ఏంటని అనుకోకండి. నిజమే. ఓ మిడత అలిగిన తన్న  డాగీ ఫ్రెండ్ కోసం చేతులు, కాళ్లు సహా శరీరమంతా కదుపుతూ..

Dance Video: అలిగిన ఫ్రెండ్‌ ముందు మిడత ‘కుంగ్‌ఫూ, కరాటే ప్రాక్టీస్’.. వైరల్ అవుతున్న వీడియో..
Mantis Dance For Doggy
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 12, 2023 | 5:50 AM

Share

బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఎవరైనా మీ కారణంగా అలిగితే మీరు ఏం చేస్తారు..? కొంచెం సేపు బతిమాలతారు, కాక పట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకొందరైతే తమ ఫ్రెండ్స్ కోసం ఏవైనా గిఫ్ట్స్ ఇవ్వడం, డబ్బు ఖర్చు పెట్టడం వంటివి చేస్తారు. ఇంకొందరైతే స్నేహితులకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ లేదా డ్రింక్స్ వంటివి ఇచ్చి కాక పట్టే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఎప్పుడైనా అలిగిన మీ ఫ్రెండ్ కోసం డ్యాన్స్ వేశారా..? ఫ్రెండ్ అలిగితే డ్యాన్స్ వేయడం ఎందుకనుకుంటున్నారా..? ఏమో మరీ.. ఓ మిడత తన ఫ్రెండ్ కోసం డ్యాన్స్ వేసింది. అవును, మిడత డ్యాన్స్ వేయడం ఏంటని అనుకోకండి. నిజమే. ఓ మిడత అలిగిన తన్న  డాగీ ఫ్రెండ్ కోసం చేతులు, కాళ్లు సహా శరీరమంతా కదుపుతూ డ్యాన్స్ వేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

sobat_semesta అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో ఓ కుక్క పిల్ల అలిగిన ముఖంతో పడుకుని ఉంటుంది. ఇక దానికి ముందు ఓ మిడత తన పూర్తి శరీరం ఊపుతూ డ్యాన్స్ వేసినట్లుగా కదులుతుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తూ నవ్వేసుకుంటున్నారు. కొందరైతే అది డ్యాన్స్ వేయడంలేదు, కుంగ్‌ఫూ ఫోజులిచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు. కాదు కాదు, అలిగిన ఫ్రెండ్‌ని బెదిరిస్తూ కరాటే ఫోజులు ఇచ్చిందంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

ఈ ట్రెండింగ్ వీడియోను మీరు ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..