Viral Video: మొసళ్ల మధ్య చిక్కుకున్న సింహం పిల్ల.. సడెన్‌గా వచ్చిన గద్ద.. చివరకు ఏమైందంటే..? వీడియో వైరల్..
ఎంత పెద్దవారైనా, శక్తివంతంగా ఉన్నా.. కొన్ని సార్లు వారికి కూడా సాయం అవసరం అవుతుంది. అడవికి రాజైనా సింహాలు సైతం ఇతర జంతువుల బారిన చిక్కుకుంటాయి. ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకోవడం వాటికి కష్టమవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో అలాంటిదే చూడవచ్చు.

సాధారణంగా సింహాలను ‘అడవికి రాజు’ అని పిలుస్తారు. వాటి ధైర్యం, బలం, వేట నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అప్పుడప్పుడు అవి కూడా ప్రమాదంలో చిక్కుకుంటాయి. అలాంటి ఒక సంఘటనను చూపిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న సింహం పిల్ల నీటి మధ్యలో చిక్కుకుని ఉంది. ఒడ్డున దాని తల్లి సింహం నిలబడి, ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తోంది. ఎందుకంటే.. ఆ నీటిలో మొసళ్ల గుంపు నెమ్మదిగా సింహం పిల్ల వైపు కదులుతోంది. ఈ క్లిష్ట సమయంలో ఆకాశానికి రాజు అని పిలువబడే ఒక గద్ద రంగంలోకి దిగుతుంది. అది వేగంగా ఎగురుతూ వచ్చి, తన పంజాలతో సింహం పిల్లను ఒడుపుగా పట్టుకుని, దాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఆపదలో ఉన్న సింహాన్ని గద్ద రక్షించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాజులకు కూడా మద్దతు అవసరం
ఈ వీడియోను ఓ వ్యక్తి ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘ఆపదలో ఉన్నప్పుడు, రాజులకు కూడా మద్దతు అవసరం.. ఆకాశ రాజు సింహాన్ని రక్షించడం ద్వారా దీనిని నిరూపించాడు’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేశారు. కేవలం 12 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల 42 వేలకు పైగా వీక్షించారు. వేలాది మంది దీనిని లైక్ చేసి, రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఒకరు “కష్టాల్లో ఉన్నప్పుడు మానవులు కాదు.. ఆపద్బాంధవుడు మాత్రమే సహాయం చేస్తాడు. హంతకుడి నుండి రక్షించేవాడు మాత్రమే నిజంగా గొప్పవాడు’’ అని రాశారు. మరొకరు ‘‘ఆపద సమయాల్లో గొప్పవాడు కూడా చిన్నవాడు అవుతాడు. సపోర్ట్ అవసరం అవుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది మాత్రం ముసళ్ల కంటే ఏఐ మరింత ప్రమాదమైనదని కామెంట్లు చేశారు. కాగా ఈ వైరల్ వీడియో ఏఐ సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో తెలియజేస్తుంది. అయితే వీడియో నిజమో కాదో నిర్ధారించుకోకుండా ఇంటర్నెట్లో వచ్చే సమాచారాన్ని నమ్మడం ఎంత ప్రమాదకరమో కూడా ఇది గుర్తు చేస్తుంది. మీరు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు, అవి నిజమైనవా కాదా అనేది నిర్ధారించుకోండి..
जब संकट गहरा हो जाए तो राजाओं को भी सहारे की ज़रूरत पड़ती है, आसमान के राजा ने ज़मीन के शेर को बचाकर यही साबित किया। 🦅🦁 pic.twitter.com/T9ckea0ieW
— Shagufta khan (@Digital_khan01) August 30, 2025
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
