Snake: వర్షాకాలంలో పాముల భయం.. ఇలా చేస్తే మీ ఇంటి సైడ్ కూడా చూడవు..
వర్షాకాలం వచ్చిందంటే చాల మందికి పాముల టెన్షన్ పట్టుకుంటుంది. పాము కాట్ల వల్ల ఇప్పటికే ఎంతోమంది మరణించారు. అందుకే ఈ సీజన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉపయోగించే ఒక చిన్న పదార్థంతో పాములు మన ఇంటివైపు రాకుండా చేయొచ్చు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇళ్లల్లో పాముల భయం మొదలవుతుంది. ఇంటి లోపలికి పాములు రాకుండా ఉండేందుకు చాలామంది ఖర్చుతో కూడిన రసాయనాలు, పౌడర్లు, యంత్రాలు ఉపయోగిస్తుంటారు. అయితే ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభమైన, సహజసిద్ధమైన పద్ధతి ఒకటి ఉంది. అదే కొబ్బరి పీచు. కొబ్బరికాయను పూజకు ఉపయోగించిన తర్వాత చాలామంది దాని పీచును పారేస్తుంటారు. కానీ ఈ కొబ్బరి పీచులో పాములను దూరం చేసే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. కొబ్బరి పీచు నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన మనకు పెద్దగా తెలియకపోయినా, పాముల సున్నితమైన ముక్కుకు ఆ వాసన భరించలేనిదిగా ఉంటుంది. ఈ వాసన ఉన్న ప్రదేశాలకు పాములు రాకుండా ఉంటాయి. కొబ్బరి పీచు పొడిగా, గరుకుగా ఉండటం వల్ల పాములు దానిపై సులభంగా జారలేవు. ఇది వాటికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
కొబ్బరి పీచును ఎలా ఉపయోగించాలి?
పీచును ఉంచడం: ఎండిన కొబ్బరి పీచు ముక్కలను మీ ఇంటి తలుపుల దగ్గర, గేటు మూలల్లో, తోట దారుల్లో, కిటికీల అంచుల దగ్గర ఉంచండి. ప్రతి 7-10 రోజులకు పీచును మారుస్తూ ఉంటే దాని ప్రభావం కొనసాగుతుంది.
పీచును కాల్చడం: రాత్రిపూట ఒక పాత ప్లేటులో లేదా మట్టి పాత్రలో కొబ్బరి పీచును వేసి కాల్చండి. దాని నుంచి వచ్చే పొగ, వాసన ఇంటి చుట్టూ వ్యాపించి పాములను దూరం చేస్తుంది.
జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి
కొబ్బరి పీచును కాల్చేటప్పుడు పిల్లలకు, త్వరగా అంటుకొన వస్తువులకు దూరంగా ఉండాలి.
వర్షం పడి కొబ్బరి పీచు తడిస్తే, దాన్ని మళ్ళీ ఎండబెట్టి వాడకవచ్చు.
ఈ సులభమైన ఖర్చు లేని పద్ధతిని పాటించడం వల్ల పాముల భయం నుంచి బయటపడటంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేసినవారవుతారు. పూజకు ఉపయోగించిన వస్తువును ఇలా మళ్ళీ వాడుకోవడం వల్ల కొబ్బరి పీచు వ్యర్థంగా మారకుండా ఉపయోగపడుతుంది.
ఇది కేవలం ఒక నివారణ పద్ధతి మాత్రమే. ఒకవేళ విషపూరితమైన పాము కనిపిస్తే, స్వయంగా ఏ ప్రయత్నాలు చేయకుండా వెంటనే పాములు పట్టే నిపుణులను లేదా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించడం మంచిది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
