Watch Video: కుక్కను చూసైనా నేర్చుకోవాలి అంటే ఇదేనేమో.. వైరలవుతున్న వీడియో
బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉన్నప్పటికీ.. కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోకుండానే ప్రయాణాలు చేస్తుంటారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై వెళ్తే ఏదైన అనుకొని ప్రమాదం జరిగి తలకు తీవ్ర గాయాలైతే ప్రాణాలతో పోరాడాల్సి వస్తోంది.

బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉన్నప్పటికీ.. కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోకుండానే ప్రయాణాలు చేస్తుంటారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై వెళ్తే ఏదైన అనుకొని ప్రమాదం జరిగి తలకు తీవ్ర గాయాలైతే ప్రాణాలతో పోరాడాల్సి వస్తోంది. అయితే ఇటీవల కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ నిబంధనలు కూడా కఠినంగా మారాయి. చలానా విధిస్తారనే భయంతో చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి తన వెనకు కూర్చున్న కుక్కకు కూడా హెల్మెట్ పెట్టి రైడ్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. @PMN2463 అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. “రూల్ ఈజ్ రూల్“ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి బైక్ నడుపుతుండగా.. అతని వెనుక కూర్చున్న కుక్క కూడా హెల్మెట్ ధరించి కూర్చుంది. అలాగే తన ముందు రెండు పాదాలను వ్యక్తి భుజాలపై వేసి బైక్ వెనుక సీటులో కూర్చుంది. ఈ విడయోపై నెటిజన్లు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.




Rule is rule..?#WhatsApp #instagramdown #TamilNadu pic.twitter.com/g47mB5mEfY
— Mohammed Nayeem (@PMN2463) May 23, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..