TOP9 ET: పాన్ వరల్డ్‌ మూవీలో అల్లు అర్జున్.. | బెదరగొడుతున్న టైగర్..!

TOP9 ET: పాన్ వరల్డ్‌ మూవీలో అల్లు అర్జున్.. | బెదరగొడుతున్న టైగర్..!

Anil kumar poka

|

Updated on: May 25, 2023 | 7:23 AM

సీనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆల్ టైమ్ క్లాసిక్ అడవి రాముడు. 1977 ఎప్రిల్ 28న రిలీజైన ఈ ఫిల్మ్ అప్పట్లోనే సంచలన వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమాను ఎన్టీఆర్ జయంతి కానుకగా మే 28న రీ రిలీజ్ చేస్తున్నారు.

01. Game Changer
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్‌ చేంజర్‌. డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 షూట్‌ కారణంగా అటకెక్కిన ఈ సినిమా షూట్ జూన్ 4 నుంచి మైసూర్ లో రీస్టార్ట్ కానుంది. ఇప్పుడిదే న్యూస్ చెర్రీ ఫ్యాన్స్‌లో తెలియని ఉత్సాహాన్ని నింపేస్తోంది.

02.Bichagadu 2
బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌గా.. సిస్టర్ సెంటిమెంట్ వచ్చిన సినిమా బిచ్చగాడు2. ఇక రీసెంట్గా రిలీజ్‌ ఈ సినిమా తెలుగు టూ స్టేట్స్‌లో కలెక్షన్లు కొల్లగొడుతోంఇ. మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా… కలెక్షన్స్‌ తెలుగు ఆడియెన్స్‌ను ఫిదా చేస్తూ.. మూడు రోజుల్లోనే దాదాపు 10 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడీ న్యూస్‌తో.. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

03. Adavi Ramudu
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆల్ టైమ్ క్లాసిక్ అడవి రాముడు. 1977 ఎప్రిల్ 28న రిలీజైన ఈ ఫిల్మ్ అప్పట్లోనే సంచలన వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమాను ఎన్టీఆర్ జయంతి కానుకగా మే 28న రీ రిలీజ్ చేస్తున్నారు. 4Kలో కన్వర్ట్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాకపోతే అది కేవలం యుఎస్‌లో మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నో రీ రిలీజ్.

04.Nagarjuna
ఘోస్ట్ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా మొదలు నాగార్జున.. తాజాగా ఓ రైటర్‌ కు ఓకే చెప్పారు. ధమాకా సినిమాతో స్టార్ రైటర్ గా మారిన.. ప్రసన్న కుమార్ డైరెక్షన్లో… ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా ఓ మలయాళ సినిమా Inspirationతో తెరకెక్కుతోందనే టాక్ మాత్రం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

05. Bhola Shankar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. నిన్న మొన్నటి వరకు స్విట్జర్లాండ్ షెడ్యూల్‌ లో తెగ చిరు తో పాటు ఆడి పాడిన ఈ టీం.. తాజాగా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ… ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరు. ట్వీట్ చేయడమే కాదు.. స్విస్‌లో తమ షూటింగ్‌ పిక్స్‌ను కూడా తన సోసల్ మీడియా హ్యండిల్లో షేర్ చేశారు. ఆ పిక్స్‌తో ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు.

06. 2018
మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 సినిమా తెలుగు రైట్స్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ సొంతం చేసుకున్నారు. ఇక 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్టైపోయింది. దాదాపు 150 కోట్లను వసూలు చేసింది. ఇక తాజాగా రిలీజ్‌ అయిన 2018 తెలుగు ట్రైలర్ కూడా… అందర్నీ ఎంగేజ్ చేస్తోంది. సినిమా చూడాలనే క్యూరియాసిటీని అందర్లో కలిగిస్తోంది.

07. Tiger Nageswara Rao
రవితేజ హీరోగా వంశీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే ద మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈమూవీ నుంచి..తాజాగా పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో రవితేజ ఫస్ట్ లుక్ రిలీజైంది. రిలీజ్ అవడమే కాదు.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

08.Adipurush
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్‌ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తాజాగా అనౌన్స్ మెంట్ ఇచ్చారు యూవీ క్రియేషన్ మేకర్స్. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వెంకటేశ్వరుడి చెంత తిరుపతిలో.. జూన్ 6న అంగరంగ వైభవంగా జరగనున్నట్టు.. ట్విట్టర్లో అనౌన్స్ చేశారు.

09.Allu Arjun
పుష్ప సినిమాతో.. పాన్ ఇండియన్ క్రేజీ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్.. ఓ హిస్టారికల్ మైథలాజికల్ సినిమాలో నటించబోతున్నారు. నెవర్ బిఫోర్ అన్నట్టు.. అశ్వద్థామగా.. పురాణ పురుశుడిగా కనిపించనున్నారు. ఎస్ ! అకార్డింగ్ టూ బన్నీ ఫ్రెండ్ బన్నీ వాసు.. ఇమ్మోర్టల్ అశ్వద్థామ సినిమాలో లీడ్‌ రోల్ అల్లు అర్జున్ చెంతకు వచ్చిందట. కానీ బన్నీ ఇంకా ఆలోచనలోనే ఉన్నారట. అయితే బన్నీ కనుక ఈ సినిమా చేసేందుకు ఓకే అంటే మాత్రం.. ఇదో క్రేజీ అండ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా మారుతుందనే విషయంలో నోడౌట్‌ అంతే!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.